నేపాల్ లో భూకంపం కారణంగా మరణించినవారి సంఖ్య పదివేల కు చేరవచ్చని భయపడుతున్నారు. అయితే కూలిన భవనాలు,ఇతరత్రా భూకంప ప్రభావిత ప్రాంతాలలో శిధిలాలు వెలికి తీసే కొద్దీ మృతదేహాలు కనిపిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉంది.దాంతో నేపాల్ లో పది వేల మంది వరకు మరణించి ఉండవచ్చన్న అంచనాకు వస్తున్నారు.కాగా వేలాది మంది ఈ భూకంపంలో గాయపడ్డారు. అనేక నగరాలలో ఇళ్లుకోల్పోయి, సర్వస్వం కోల్పోయిన ప్రజలు ప్రస్తుతం టెంట్ ల కింద ఉండవలసి వస్తోంది.  ఇక ఈ సంఘటనలో  వెటకారం  తెలుగు సినిమా యూనిట్ కూడా ఉంది  విజయ్ అనే నటుడు ,కొరియోగ్రాఫర్ చనిపోగా మరికొంతమంది గాయపడ్డారు. తర్వాత కొన్ని నిర్ఘాంత పోయే వార్తలు వచ్చాయి అవి భూకంపంలో   బాలీవుడ్ సినిమాకి చెందిన మరో 8మంది సిబ్బంది కూడా చనిపోయారట .


శిథిలాల కింద చిక్కుకొని చనిపోయిన వారు.


బాలీవుడ్ వర్గానికి మరో విషాదం మిగిలింది  అవును ఈ విషయం హీరోయిన్ ముగ్దా గాడ్సే చెప్పేవరకు బయటి ప్రపంచానికి తెలీదు . మనోజ్ డామన్ దర్శకత్వంలో ముగ్దా గాడ్సే - రస్లాన్ జంటగా నటిస్తున్న చిత్రం ఇటీవల నేపాల్ లోని పోక్రా లో షూటింగ్ జరుపుకుంది . ఈ షూటింగ్ లో హీరో హీరోయిన్ లపై సన్నివేశాలను చిత్రీకరించారు . అయితే హీరో హీరోయిన్ ల సన్నివేశాలు పూర్తి కాగానే నేపాల్ నుండి భారత్ తిరిగి వచ్చారు హీరో హీరోయిన్ లు కానీ చిత్ర యూనిట్ మాత్రం అక్కడే ఉండి మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట . అదే సమాయంలో వచ్చిన భూకంపానికి యూనిట్ లోని ఎనిమిది మంది చనిపోయారని సోషల్ మీడియాలో పేర్కొంది ముగ్దా గాడ్సే . 


మరింత సమాచారం తెలుసుకోండి: