ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ ఏమిటంటే అదే పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ఫిల్మ్ కోబలి. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 మూవీ ఇంకా షూటింగే జరుపుకోలేదు, కాని కోబలి మూవీకి సంబంధించిన టాక్స్ అప్పుడే ఊపందుకున్నాయి. పవన్ కళ్యాణ్ మరో 8 నెలల గ్యాప్ లో రెండు చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి.


మొదటిది గబ్బర్ సింగ్ 2 అయితే, రెండోవది కోబలి


అందులో మొదటిది గబ్బర్ సింగ్ 2 అయితే, రెండోవది కోబలి ఫిల్మ్. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో కోబలి చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. చారిత్రాత్మక సినిమాలు, మహిళ ప్రధాన కథాంశాలతో కూడిన భారీ చిత్రాల్లో నటిస్తూ అనుష్క బిజీగా ఫిల్మ్ కెరీర్ ని గడుపుతోంది. తమిళంలో గ్లామర్ పాత్రలకు అంగీకారం తెలుపుతున్న ఈ అమ్మడు తెలుగులో మాత్రం నటనకు ఆస్కారమున్న పాత్రల వైపే మొగ్గుచూపుతోంది.


త్రివిక్రమ్ దర్శకత్వంలో కోబలి 


తాజాగా ఆమె తెలుగులో మరో క్రేజీ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కోబలి పేరుతో ఓ సినిమాను తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్ ఓ విలక్షణ కథను సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ చిత్రంలో అనుష్క కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం.

తెలుగులో అగ్రకథానాయకులందరి సరసన నటించిన ఆమె పవన్‌కళ్యాణ్‌తో జోడీ కట్టనుండటం ఇదే తొలిసారి కావటంతో, ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. అనుష్క పేరు ప్రస్తావించిన వెంటనే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఈ కాంబినేషన్ పై అందరి దృష్టి పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: