మెగా పేరు చెబితేనే పులకించి పోతాడు బండ్ల గణేష్. చిన్న నటుడి స్థాయి నుంచి బిగ్గెస్ట్ ప్రోడ్యూసర్ స్థాయికి ఎదిగిన బండ్ల గణేష్ రోజుకోటైను ట్విట్స్ పెడుతూ అందునా మెగా ఫ్యామిలీ గురించి ట్విట్స్ పెడుతూ మెగ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాడు. నిన్నటికి నిన్న చిరంజీవి 150 వ సినిమా ఖరారైనట్లు కథ కూడా ఓకే అయినట్లు చెప్పాడు. దీంతో మెగా ఫ్యాన్స్ పెద్ద పండగ అన్నట్లు భావించారు. అంతలోనే అబ్బే   అదంతా వట్టిదే అంటూ మరో ట్వీట్ ఇచ్చి బాంబ్ పేల్చాడు .


మెగాస్టార్ చిరంజీవి


పరమేశ్వరి బ్యానర్ పై ఇంకా ఏ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదని ,ఒకవేళ అటువంటి దేమైనా ఉంటే గర్వంగా చెబుతానని సెలవిచ్చాడు . ఇలా బండ్ల గణేష్ ట్వీట్ చేయడంతో మెగా అభిమానులు ఏమి పాలుపోక ఉస్సూరు మంటున్నారు. వీడి అభిమానం తగలయ్యె ఎంత మెగా ఫ్యామిలీపై అభిమానం ఉంటే మటుకు మెగాఫ్యాన్స్ ను ఇంత గందరగోళం చేయాలా అంటూ ఫ్యాన్స్ వాపోయారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: