మేడే రోజు హైదరాబాద్ ఫిలింఛాంబర్స్ లో జరిగిన మేడే వేడుకలు ఆసక్తికరం సంభాషణలకు దారి తీశాయి. ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వమని తెలంగాణ మంత్రి తలసాని హెచ్చరించడం 
వాతావరణాన్ని వేడెక్కించింది. అంతే కాకుండా.. లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించాలని.. లేకుంటే తేడాలు వస్తాయని డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చారు. 


మంత్రి మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత మాట్లాడిన పరుచూరి గోపాలకృష్ణ ఇన్ డైరెక్టుగా మంత్రి తలసానిని ఘాటైన కౌంటర్ ఇచ్చారు. మంత్రిగారు చెప్పినట్టు టాలెంట్ ను 
ప్రోత్సహించాల్సిందేనని పరుచూరి అంటూనే మెత్తగా చురకలు వేశారు. తాము పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. 


తాము సారధి స్టూడియోలో ఓ షూటింగ్ స్పాట్ లో ఉండగా.. ఓ వ్యక్తివచ్చి ఇక్కడ పరుచూరిగారెవరు అని అడిగారట. ఎందుకు అని అంటే.. ఎన్టీఆర్ రమ్మంటున్నారని చెప్పారట. అదీ.. 
టాలెంట్ ను ప్రోత్సహించడమంటే.. ఐనా.. ఎన్టీఆర్ అంతటివాడు.. పరుచూరును ఎందుకు వెదుక్కుంటూ వచ్చాడు. టాలెంట్ ఉండబట్టే కదా..అని చెప్పుకొచ్చారు. 


ఓవైపు టాలెంట్ ను ప్రోత్సహించాలని చెబుతూనే.. అసలు టాలెంట్ లేకపోతే.. ఎవరూ ఏమీ సాయం చేయలేరన్న అర్థం వచ్చేలా పరుచూరి మాట్లాడారు. ఆయన యథాలాపంగా అన్నా.. 
మంత్రి మాటలకు కౌంటర్ గా అన్నా.. ఆయన మాటలు అందర్నీ ఆలోచింపజేశాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: