కాజల్ అందాల ముద్దుగుమ్మ. చూడగానే ఇట్టే ఆకర్శించే పెద్ద  కళ్లు, అందమైన పెదాలు, మంచి రంగు, అల్లరి, అభినయం కలగలిపిన హీరోయిన్ కాజల్. ఈ అమ్మడు వచ్చిన కొత్తలో అసలు సినిమాలకు పనికి వస్తుందా అని అనుకున్నారు. లక్ష్మీకళ్యానం సినిమాలో అమాయకమైన నటనతో కళ్యాన్ రామ్ సరసన నటించిన ఈ అమ్మడు అనతి కాలంలోనే బిగ్గెస్ట్ హీరోలతో నటించి షబాష్ అనిపించుకుంది. మగధీర, బిజినెస్ మెన్ వంటి సినిమాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. కోలీవుడ్లో తొలి రోజుల్లో సరైన ఆదరణ లభించకపోయినా నాన్అవన్ అల్ల, తుపాకీ, జిల్లా చిత్రాలు ఈమెకు చక్కని విజయాలను కట్టబెట్టాయి. దీంతో ప్రేక్షకులు కాజల్ అందానికి సమ్మోహనం అయ్యారు.


ఓ మ్యాగజన్ పై కాజల్ స్టిల్


ప్రస్తుతం ఆ అమ్మడు ధనుష్, విశాల్ కు జంటగా పలు సినిమాల్లో నటిస్తోంది. త్వరలోనే విక్రమ్ తో కలిసి డ్యూయెట్ కూడా పాడేందుకు రెడీ అవుతోంది. అయితే ఇంతగా తనను ఆదరించి అభిమానించిన ప్రేక్షకులకు కాజల్ ధన్యవాదలు తెలిపింది. తను ఒఖ అందమైన శిల్పంలా పోల్చుకుంటుంది ఈ ముద్దగుమ్మ. వాస్తవానికి తాను సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చానని, తను ఊహించని విధంగా ఇన్నేళ్లుగా ప్రముఖ హీరోయిన్గా రాణిస్తున్నానని, తాను ఒక ప్రముఖ నటినని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నా అంటుంది కాజల్.


మరింత సమాచారం తెలుసుకోండి: