సినిమా రంగంమంటేనే కోట్లతో వ్యవహారం.. అందులోనూ పెద్ద నిర్మాతల చిత్రాల సంగతి చెప్పే అవసరమే లేదు. మరి ఇలాంటి చిత్ర పరిశ్రమలో గొడవలొస్తే ఏం చేస్తారు. ఇద్దరు నిర్మాతల మధ్యో.. ఇద్దరు నటీనటుల మధ్యో.. నిర్మాత, నటుల మధ్య.. ఇలా వచ్చే గొడవలను ఎవరు తీరుస్తారు..?


ఇప్పటి వరకూ ఆ పని మా , ఫిలింఫెడరేషన్, దాసరి వంటి పెద్దలు చేసేవారు. రెండు వర్గాలనూ కూర్చోబెట్టి సర్ది చెప్పేవారు.. కానీ ఇకపై అలా సాగడానికి వీల్లేదట. సినీపరిశ్రమలో గొడవలు, సెటిల్ మెంట్లు మా దగ్గరకే రావాలి.. వాటిని మేమే పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది.

Image result for telugu cinema industry

మేడే ఉత్సవాలలకు హాజరైన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.. ఈ విషయం సినీ పరిశ్రమ పెద్దల ముందే కుండబద్దలు కొట్టారు. ఇక్కడ ఉన్నది తెలంగాణ ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని గట్టిగానే చెప్పేశారు. దీన్నిబట్టి చూస్తే తెలుగు సినీపరిశ్రమపై పెద్దన్న పాత్ర పోషించేందుకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు డిసైడైనట్టే కనిపిస్తోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: