సినీహీరో ధీరోధాత్తుడై ఉండాలి. సవాళ్లను స్వాగతించగలగాలి.. ఏటికి ఎదురీదాలి.. అప్పుడే హీరోయిజం ఉట్టిపడుతుంది. కథ రక్తికడుతుంది. ఈ విషయం దర్శక దిగ్గజం రాజమౌళికి బాగా తెలుసు. అందుకే టాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకుడిగా నిలబడ్డాడు. 


భారీ అంచనాలతో విడుదల కాబోతున్న బాహుబలి ఫస్ట్ పోస్టర్ కూడ అదరగొట్టింది. మహాసముద్రంలోంచి ఓ గాజు చెయ్యి ఓ పసిబిడ్డను చేతబట్టుకుని దూసుకొచ్చినట్టున్న ఈ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. బాహుబలిపై అంచనాలు మరింతగా పెంచుతోంది. 


ఏది ఎదురైనా సరే.. అతడు గమ్యం చేరుకోవాల్సిందే.. అంటూ తన ఫస్ట్ లుక్ గురించి దర్శకుడు రాజమౌళి పోస్ట్ చేశారు.  ప్రతి కథకు ఓ ప్రధానమైన సందర్భముంటుంది. అది ఆ మొత్తం కథాంశాన్ని నిర్వచించేలా.. నడిపించేలా ఉంటుంది. బాహుబలికి అదే గుండెలాంటిదని రాజమౌళి ట్వీట్ చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: