నిన్న విడుదలైన ‘బాహుబలి’ అఫీషియల్ పోస్టర్ పై కొన్ని గంటలు కూడ పూర్తి కాకుండానే ఈ పోస్టర్ కాన్సెప్టు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోస్టర్ 1998లో వచ్చిన ‘సిమన్ బిర్చ్' అనే హాలీవుడ్ సినిమాకు కాపీ అంటూ వెబ్ మీడియాలో రాజమౌళి విమర్శకులు జక్కన్న పై మాటల యుద్ధం మొదలు పెట్టారు. 

గతంలో కూడా ఈ సినిమా మేకింగ్ వీడియో రాజమౌళి విడుదల చేసినప్పుడు ఇలాంటి కాపీ వివాదాలు రాజమౌళి పై వచ్చాయి. అయితే అప్పట్లో రాజమౌళి తన ఫై వస్తున్న విమర్శల పై స్పందిస్తూ కాపీ వేరు స్పూర్తి వేరు అంటూ తన పై వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చాడు. అయితే రాజమౌళి ఈ కాపీ వివాదాల పై గతంలోనే క్లారిటీ ఇచ్చినా ‘బాహుబలి’ కి సంబంధించిన ప్రతి విషయాన్ని చాల నిశితంగా పరిశీలిస్తూ ఇటువంటి కొత్తకొత్త కాపీ వివాదాలను తెర పైకి తీసుకు వస్తూనే ఉన్నారు విమర్శకులు.

అంతేకాదు ఈసినిమా పూర్తి అయి విడుదలయ్యే సమయానికి ఇంకా ఇలాంటివి ‘కాపీ'లు ఎన్ని చూడాల్సి వస్తుందో అని ఫిల్మ్ నగర్లో రాజమౌళి పై సెటైర్లు వేస్తున్నారు. తెలుగు సినిమాల పై అదేవిధంగా తెలుగు దర్శకుల పై కాపీ వివాదాలు రావడం కొత్త కాకపోయినా ‘బాహుబలి’ సినిమా పై మాత్రం ఈ వివాదాలు కొద్దిగా హెచ్చు స్థాయిలోనే వస్తున్నాయి. 

ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల పై 17 విఎఫ్ఎక్స్ స్టూడియోలలో దాదాపు 600 మంది ఆర్టిస్టులు పని చేస్తున్నారు అంటే ఈ సినిమా పై ఎంత శ్రద్ద పెడుతున్నాడో అర్ధం అవుతుంది. త్వరలో ఒక ప్రముఖ ఇటర్నేషనల్ మేగజైన్లలో ‘బాహుబలి’ గురించిన ఆర్టికల్స్ రాబోతున్న నేపధ్యంలో ‘బాహుబలి’ అఫీషియల్ పోస్టర్ పై ఇటువంటి కామెంట్స్ రావడం రాజమౌళికి కొద్దిగా షాకింగ్ న్యూస్ అని అనుకోవాలి.. 







మరింత సమాచారం తెలుసుకోండి: