ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ లేకుండా విడుదల కావడం లేదు. ముఖ్యంగా కమల్ హాసన్ సినిమాలు అయితే మరీను. విశ్వరూపం ఎన్నో అవంతరాలు  దాటుకొని ప్రజల ముందుకు వచ్చింది. కోలీవుడ్ లో కొన్ని సినిమాలు కూడా అంతే తీరా థియేటర్ లోకి వచ్చే సమయానికి ఆగిపోవడం తిరిగి మరో రోజు రిలీజ్ కావడం జరగుతున్నాయి. ఇలా చేస్తే సినిమాపై ఆసక్తి కలుగుతుందని అనుకుంటారో లేక నిజంగా వచ్చే ఇబ్బందులో తెలియదు.  వాస్తవానికి ఈ చిత్రం మే ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సివుంది. అయితే, తన వద్ద తీసుకున్న అప్పును చెల్లించకుండా 'ఉత్తమ విలన్' చిత్రం విడుదల చేసేందుకు వీల్లేకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ  చెన్నై వలసరవాక్కంకు చెందిన తంగరాజ్ మద్రాసు హైకోర్టులో గత నెల పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఈ చిత్రం విడుదల బ్రేకు పడింది. 


ఉత్తమ విలన్ లో ఓ దృశ్యం

Uttama Villain line clear

తాజాగా సమస్య పరిష్కారం కావడంతో ‘ఉత్తమ విలన్' చిత్రాన్ని ఈ రోజు (మే 2) మధ్యాహ్నం నుండి పలు చోట్ల షోలు ప్రారంభం అయినట్లు సమాచారం. ఉత్తమ విలన్ చిత్రానికి రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించారు. పూజాకుమార్‌, ఆండ్రియా, పార్వతీ మేనన్‌ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని తెలుగులో సి.కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. కమల్‌హాసన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఎన్‌.లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్‌, కమల్‌హాసన్‌ కు చెందిన రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. గిబ్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మరోవైపు.. ఉత్తమ విలన్ చిత్రం ఆది నుంచి వివాదాల మయమైంది. ఈ సినిమాలో కమల్ విచిత్ర వేషధారణ ఒక హాలీవుడ్ చిత్రం నుంచి కాపీ కొట్టారని ఫొటోలు సహా ప్రచురితమైనాయి. పుదియ తమిళగం కట్చి అధ్యక్షులు కృష్ణస్వామి సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 


ఉత్తమ విలన్ లో దృశ్యం

 ‘ఉత్తమ విలన్’కు బ్రేక్
హిందూ దేవుళ్లను చిత్రంలో కించపరిచారంటూ కొన్ని హిందూ సంస్థల కార్యకర్తలు కమల్ ఫొటోలను తగులబెట్టి ఆందోళన నిర్వహించారు. అయితే వీటన్నింటినీ అధిగమించి ఉత్తమ విలన్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేయగా..


మరింత సమాచారం తెలుసుకోండి: