బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ పేరు వింటేనే యూత్ మంచి జోష్ లో ఉంటారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కుమార్తెగా చిన్న వయసులోనే హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ కెరియర్ తొలి నుంచి మంచి దూకుడుగానే కొనసాగుతోంది. అందాల ఆరబోత, కిస్సింగ్ సీన్స్ లో అలియా నటించినంత స్పీడ్ గా మరే హీరోయిన్ ప్రస్తుతం నటించి మెప్పించలేక పోతోంది.

ప్రముఖ బాలీవుడ్ సినిమాల నిర్మాత తండ్రి మహేష్ భట్ అలియా భట్ సోదరి పూజా భట్ సినిమాలన్నీ దాదాపుగా సెక్స్ రిలేటెడ్ సబ్జెక్టతోనే ఉన్న నేపధ్యంలో అలియా చన్నతనం నుండి అలాంటి సినిమాలు చూస్తూ పెరిగి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అయితే అలియా భట్ కు మాత్రం సెక్స్ గురించి తనకు పెద్దగా తెలియదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

అంతేకాదు తనను సెక్స్ సంబంధమైన విషయాల గురించి ప్రశ్నలు వేయవద్దు అంటూ ఈమధ్య తనకు ఎదురుబడ్డ బాలీవుడ్ మీడియా ప్రతినిధులకు వార్నింగ్ లు కూడా ఇస్తోంది. ‘నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ సెక్స్ గురించి మాత్రం నాకు పెద్దగా తెలియదు' అంటూ మీడియా మైండ్ ను బ్లాంక్ చేస్తోంది అలియా. 

బాయ్ ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన సెక్స్ అనుభవించి ఉండాలని ఎక్కడైనా రూల్ ఉందా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తోంది అలియా. అంతేకాదు తన తండ్రి ముందు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ వచ్చి ముద్దు పెట్టుకుంటే తన తండ్రి మహేష్ భట్ ఆ పనిచేసిన వ్యక్తికి చెంప చెళ్ళుమనిపిస్తాడు అంటూ సమాధానాలు ఇస్తోంది అలియా భట్. టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలు మోజు పడుతున్నా వారి వంక కన్నెత్తి కూడ చూడని అలియా భట్ చెప్పే మాటలు మీడియాకు ఎప్పుడూ హాట్ టాపిక్.. 






మరింత సమాచారం తెలుసుకోండి: