మెగాస్టార్ చిరంజీవి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మాస్ హీరో. తెలుగు చిత్ర సీమలో అగ్ర హీరోల కాంపిటీషన్ లో స్వయం కృషితో ఎదిగిన నటుడు చిరంజీవి. ఈయన నీడన మరెందరో వారసత్వపు హీరోలుగా వచ్చారు. అయితే మెగాస్టార్ స్టాలిన్ సినిమా తర్వాత మరే సినిమా తీయలేదు. సొంతంగా ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రేస్ పాలనలో కేంద్ర మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టాడు. ఉమ్మడి రాష్ట్రం కోసం మాట్లాడినా అది స్వయంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం కాబట్టి గట్టిగా నోరు మెదపలేదు. 


ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి


మరి ఇప్పుడు చిరంజీవి నోరు విప్పాడు అంటే బహుషా తన 150 చిత్రం గురించి అనుకుంటే పొరపాటే..! మొట్ట మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో గుంటూరు లో నిరసన దీక్ష జరిగింది . ఆ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి తెలుగుదేశం ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు . రాజధాని పేరుతో రైతుల నుండి భూములను బలవంతంగా లాక్కొని వాళ్ళకు సమాధులు కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు . భూసేకరణ బిల్లు కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి రైతులకు భరోసా ఇవ్వడానికి రాహుల్ గాంధీ జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తారని అన్నారు రాజ్యసభ సభ్యులు ,మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి . 


మరింత సమాచారం తెలుసుకోండి: