పవన్ కళ్యాన్ తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పడు మంచి ఫామ్ లో ఉన్నహీరో. సూపర్ హిట్ కేరాఫ్ అడ్రస్ గా మారిన పవన్ కళ్యాన్. గోపాల గోపాల సినిమా తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆ సినిమా కూడా మల్టీస్టారర్ సినిమా కావడంతో సోలోగా ఆయన మొఖానికి మళ్లి రంగు ఎప్పుడు వేసుకుంటారా అని పవన్ అభిమానులు ఆశగా ఎదురు చుస్తున్నారు. వాస్తవానికి దాసరి సినిమా అనుకున్నారు. తర్వాత త్రివిక్రమ్ సినిమా అనుకున్నారు.ఇవేవీ సెట్ ముందుకు రాలేదు. త్రివిక్రమ్ కోబలి కి సంబంధించిన న్యూస్ ఈ మధ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. 


గబ్బర్ సింగ్ 2 ఫ్యాన్స్ పోస్టర్


ఇప్పడు సంక్రాంతి బరిలో గబ్బర్ సింగ్ 2 రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత శరత్ మారార్ తెలిపారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి సంక్రాంతి కి రిలీజ్ చేయాలనీ వాళ్ళ ప్లాన్ అట. రవితేజ తో పవర్ చిత్రాన్ని తీసిన బాబీ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు . అనీషా అంబ్రోస్ ని కథానాయికగా ఎంపిక చేసారు కూడా మరో హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది . అయితే ఇప్పటికే చాలాసార్లు అదిగో గబ్బర్ ఇదిగో గబ్బర్ అన్నారు కాబట్టి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే వరకు నమ్మేలా లేరు అభిమానులు . 


మరింత సమాచారం తెలుసుకోండి: