ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అంటూ ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో తన ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభిస్తూ శివాజీ పవన్ పై చేసిన కామెంట్స్ అనేక చర్చలకు దారితీస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తన తల పైకి ఎత్తుకుని ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటనలు చేసిన శివాజీ ఈరోజు తన పోరాటాన్ని క్లైమాక్స్ కు తీసుకు వెళుతూ తన ఆమరణ నిరాహారదీక్షను బ్రహ్మాస్త్రం లా వదిలాడు.

అయితే శివాజీ మీడియా ముందుకు మై పుచ్చుకుని వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఈ విషయమై శ్రద్ధ పెట్టి జనం మధ్యకు వచ్చి ఉద్యమం చేస్తే ఖచ్చితంగా కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని శివాజీ కామెంట్స్ చేస్తున్నాడు.

అయితే ఈ కామెంట్స్ ఏదో యధాలాపంగా అన్నవి కాదని తెలుగు దేశం పార్టీ అధినాయకత్వం పవన్ ను ఈ విషయమై ఇరుకున పెట్టడానికే మాటమాటకీ శివాజీ నోటి వెంట పవన్ కళ్యాణ్ పేరు వచ్చేలా ఒక వ్యుహత్మక ఎత్తుగడ వేస్తోంది అని అంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన అన్ని వాగ్ధానాలు తీర్చలేని పరిస్థితి ఏర్పడటంతో వచ్చే 2019 ఎన్నికల సమయంలో తెలుగు దేశానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అన్న విశ్లేషణలు ఇప్పటి నుంచే హడావిడి చేస్తున్నాయి

ఈ పరిస్థుతుల నేపధ్యంలో పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ పార్టీని ఉదృతం చేసి నిజంగా జనంలోకి వెళితే చంద్రబాబుకు కష్టకాలం తప్పదు అనే వాఖ్యలు ఉన్నాయి. ఈ స్థితిలో పవన్ కు చెక్ పెట్టాలి అంటే అనుకోకుండా అస్త్రంగా మారిన శివాజీని శక్తిగా మార్చి పవన్ కన్నా ప్రత్యేక రాష్ట్ర హోదా విషయంలో శివాజీ బాగా స్పందించాడు అన్న భావనను సామాన్య ప్రజలలోకి పంప గలిగితే అది పవన్ ఇమేజ్ ని ఎంతోకొంత దెబ్బ తీస్తుంది అన్న తెలుగుదేశ వ్యూహాత్మక ఎత్తుగడలో శివాజీ ఒక అస్త్రంగా మారాడు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చివరికి ఈ నిరాహారదీక్ష ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: