దర్శక రత్న దాసరి నారాయణరావు నిర్మాతగా పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సినిమాను  ప్రకటించారు కానీ.. ఇంకా స్టోరీ డిస్కషన్స్ దగ్గరే ఉంది. ఐతే.. పవన్ కల్యాణ్ దాదాపు నెంబర్ 1 ప్లేస్ లో ఉండి.. దాసరికి ఎందుకు అవకాశమిచ్చాడు.. ఇది అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న.
దర్శకరత్నకే షాక్..


అసలు ఈ కొత్త సినిమా గురించి ఎవరు ముందు స్టెప్ వేశారు. దాసరి పవన్ ను అడిగారా.. పవనే దాసరికి ప్రపోజ్ చేశాడా.. ఇన్ సైడ్ ఏం జరిగింది. ఈ విషయంపై దాసరి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. దాసరితో సినిమా ప్రపజల్ పవన్ కల్యాణ్ నుంచే మొదట వచ్చిందట. 
కలయా.. నిజమా..?


ఇటీవల ఓసారి పవన్ దాసరి వద్దకు వచ్చి.. మీలాంటి వాళ్లు సినిమాలకు దూరంగా ఉండకూడదు.. మీరేంటో నాకు తెలుసు.. మీకు సినిమా చేస్తానని అనేంత పెద్దవాణ్ణి కాదు నేను.. కానీ..  మీరు ఒప్పుకుంటే, మీతో సినిమా చేయాలనుంది అన్నాడట. దాంతో దాసరి షాక్ తిన్నారట. ఆ తర్వాత కూడా పవనే మరోసారి ఫోన్ చేసి.. మన సినిమా గురించి ఏం చేశారని అడిగాడట. అప్పటికి కానీ.. దాసరికి నమ్మకం కలగలేదట. అప్పుడే నిర్మాతగా మాత్రమే చేస్తాను. డెరైక్షన్ చేయను. వేరే డెరైక్టర్‌తో చేద్దాం అన్నారట. అదీ అసలు సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: