పవన్ కళ్యాణ్  కు చిరంజీవికి మధ్య సాన్నిహిత్య సంబంధాలు అంతంతమాత్రమే అన్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే చిరంజీవి పేరుతో మెగా అభిమానులు కొంతమంది చేయబోతున్న ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అడ్డు తగిలాడు అన్న వార్తలు బయటకు వచ్చాయి.


రాబోతున్న చిరంజీవి పుట్టినరోజు మరియు షష్టిపూర్తి సంబరాలను


ఈ వార్తలలో ఎన్ని వాస్తవాలో తెలియకపోయినా పవన్ కు తన అన్న చిరంజీవి పట్ల ఉన్న అనుభందాన్ని ఈ వార్తలు తెలియచేస్తున్నాయి. ఇక వివరాలలోకి వెళితే ఆగష్టులో రాబోతున్న చిరంజీవి పుట్టినరోజు మరియు షష్టిపూర్తి సంబరాలను అత్యంత ఘనంగా జరుపుకోవాలని గుంటూరుకు చెందిన కొంతమంది చిరంజీవి అభిమానులు నిర్ణయించుకున్నట్లు టాక్.

దీనికోసం ఈ ఫంక్షన్ కు వచ్చే మెగా అభిమానులు అంతా ఒక కార్పరేట్ కంపెనీ మీటింగ్ లుక్ తీసుకు వచ్చే విధంగా అందరూ విధిగా సూట్లు వేసుకుని రావాలని సూచించినట్లు తెలుస్తోoది. అంతేకాదు ఈ కార్యక్రమాలను అత్యంత ఘనంగా జరపడానికి 50 లక్షలు నుండి కోటి రూపాయల వరకు ఫండ్ వసూలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కూడ వార్తలు గుప్పుమన్నాయని టాక్.


చిరంజీవి ఇమేజ్ గురించి పవన్ ఎంత శ్రద్ధ 


ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళడంతో పవన్ ఇటువంటి ఆలోచనలు చేయవద్దని చిరంజీవి అభిమానులకు గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా అసలు ఈ వ్యవహారాన్ని నడుపుతున్న వ్యక్తులు ఎవ్వరు? అన్న విషయం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనితో ఈ కార్యక్రమ ఫండ్ రైజింగ్ ఆలోచన ఆగినట్లు టాక్. తన అన్న చిరంజీవి ఆలోచనలు నచ్చక పోయినా చిరంజీవి ఇమేజ్ గురించి పవన్ ఎంత శ్రద్ధ పడతాడో ఈ విషయాన్ని బట్టి అర్ధమౌతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: