దర్శక రత్నగా టాలీవుడ్ సినిమా రంగాన్ని ఒక చక్రవర్తిలా ఏలిన దాసరి నారాయణరావు హవా ముగిసి పోయింది అని అందరూ అనుకుంటున్నా ఇంకా తన చివరి యుద్ధం మిగిలేవుంది అంటున్నారు దాసరి. రాజ్ కపూర్, పుల్లయ్య లాంటి మహా దర్శకులు వారు చనిపోయేంత వరకు సినిమాలకు దర్శకత్వం వహిoచినట్లుగానే తాను కూడ తన తుది శ్వాస వరకు సినిమాలకు దర్శకత్వం వహిస్తానని దాసరి సంచలనాత్మక వ్యాఖ్యలు చేసారు.


దాసరి ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన


ఈరోజు తన 71వ పుట్టినరోజు సందర్భంగా అనేక విషయాలను దాసరి ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేసాడు. మహాభారత యుద్ధాన్ని సినిమా తెర పై చూపించాలని తన కోరిక అంటూ మహా భారత కథ పై ఇప్పటికే చాలామంది సినిమాలు తీసినా మహా భారత యుద్ధం జరిగిన 18 రోజులలో ప్రతిరోజు రాత్రిపూట జరిగిన రాజకీయ తంత్రాలు గురించి ఎవరూ సినిమా తీయలేదని ఇప్పటి రాజకీయాల ఎత్తుగడలను మించి మహా భారత యుద్ధంలో రాజకీయ తంత్రం ఉంటుంది అని కామెంట్స్ చేసాడు దాసరి.


ఆ మహాభారత యుద్ధ సంఘటనలను నాలుగు భాగాలుగా సినిమా తీయాలని అనుకుంటున్నానని ఈ స్క్రిప్ట్ కు సంబంధించి ఒక విదేశీ కంపెనీతో చర్చలు చేస్తున్నాననీ అంటూ తన కోరికను వినిపించాడు దాసరి. దాదాపు 400 కోట్లు ఖర్చు అయ్యే ఈ సినిమా తాను తీయ గలిగితే నాజీవితానికి అదే చివరి చిత్రంగా మారి ఘంటశాలకు ‘భగవద్గీత’ చివరిగా మరపురానిదిగా ఎలా మిగిలిపోయిందో ‘మహాభారతం’ తన చివరి యుద్ధంగా మిగిలి పోతుందని అన్నారు దాసరి.


సినిమాల పై దాసరి మాట్లాడుతూ


ఇప్పుడు వస్తున్న సినిమాల పై దాసరి మాట్లాడుతూ ఆడవాళ్ళు అంతా బుల్లితెరకు పరిమితమై పోవడంతో నేటి సినిమా ధియేటర్లకు కేవలం 16 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ప్రేక్షకులు వస్తూ ఉండటంతో వారికి నచ్చే వెటకారం, ఎగతాళి, పిచ్చి జోకులు, పంచ్ డైలాగ్స్, బూతులు, ఐటమ్ సాంగ్స్ పెట్టి సినిమాలు తీయవాలసిన పరిస్థితి ఏర్పడింది అని దీనికి పరిష్కారం ఎవరి చేతులలో లేదని షాకింగ్ కామెంట్స్ చేసాడు దాసరి.. 









మరింత సమాచారం తెలుసుకోండి: