విలక్షణ నటుడు కమలహాసన్ తాను నటించే నిర్మించే సినిమాలకు నష్టం వచ్చినా తాను అనుకున్నది అనుకున్నట్లుగా తెర పై చూపెట్టాలి అన్న తపన తోనే కమల్ హాసన్ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ‘విశ్వరూపం’ నుండి ‘ఉత్తమ విలన్’ వరకు కమలహాసన్ చేస్తున్న ప్రయోగాలకు అడ్డంకులు ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా తన ప్రయోగాలను కొనసాగిస్తునేఉన్నాడు. మొన్న విడుదలైన తన ‘ఉత్తమ విలన్’ ప్రమోషన్ లో భాగంగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను లేటెస్ట్ గా నటించిన ‘ఉత్తమ విలన్’ సినిమా గురించి అనేక విషయాలను షేర్ చేసుకున్నాడు కమల్. 


తాను నటించిన ‘ఉత్తమ విలన్’ ఉంటుందని చెప్పాడు కమల్


ప్రతి వ్యక్తిలోనూ ఒక విలన్, ఒకనాయకుడు అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారని అయితే మనలో బయటకు వచ్చే విలన్ ను తొక్కి పెట్టడమే జీవితం అంటూ కామెంట్స్ చేసాడు కమల్. ఇక పురాణాలను తీసుకుంటే శ్రీకృష్ణుడు అంత విలన్ మనకు పురాణాలలో మరొకరు ఎవరూ కనిపించారని, కౌరవులకు, పాండవులకు ఆఖరికి మహాభారత కథను చదివే వాళ్లకు కూడ శ్రీకృష్ణుడు విలన్ లాగే కనిపిస్తాడని అయితే ప్రజలకు మాత్రం ఆయన దేవుడని భావిస్తారని కామెంట్స్ చేసాడు కమల్. ఇదే మూల కథతో తాను నటించిన ‘ఉత్తమ విలన్’ ఉంటుందని చెప్పాడు కమల్.

తాను ‘విశ్వరూపం’ సినిమాను విడుదల చేసే సమయంలో సమస్యలు వచ్చినప్పుడు తన ఇల్లును తాకట్టు పెట్టుకుని అప్పు ఇచ్చిన ఫైనాన్షియర్ తన బాకీ నిమిత్తం తన ఇల్లును తీసుకుంటాడు అని వార్తలు వచ్చినప్పుడు ఆ వార్తలను విన్న తమిళనాడులోని ఒక వ్యవసాయ కుటుంబం తనకు తమ ఇంటి డాక్యుమెంట్స్ ని పంపించి ఆ ఇల్లును తీసుకోమని కోరారని, అయితే అటువంటి వ్యక్తులు కూడా ఉంటారా అని ఆశ్చర్య పడ్డ తాను వారి ఇంటికి వెళ్ళి వారికి బట్టలు పెట్టి నమస్కరించి తనకు ఒక మంచి బంధువు దొరికారు అని ఆనంద పడ్డానని తెలియచేసాడు కమల్. 

అంతేకాదు ఆ సందర్భంలో దాదాపు 20 మంది అభిమానులు తమ ఇళ్ళను తీసుకోమని ఉత్తరాలు వ్రాసారని చెపుతూ అటువంటి అభిమానులను తనకు ఉన్నారని తెలిసినప్పుడు తన వద్ద వందల కోట్లు డబ్బు లేదు అని బాధ కలగదని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు కమల్. అయితే మొన్న విడుదలైన ‘ఉత్తమ విలన్’ ప్రేక్షకులకు సరిగ్గా అర్ధం కాకపోవడంతో ఈ ప్రయోగం కూడ ఫెయిల్ అయినా కమల్ తన ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉంటాడు అని అనుకోవాలి.. 









మరింత సమాచారం తెలుసుకోండి: