తమిళ చిత్రసీమాలో ఆయనో గొప్ప దర్శకుడు, మరి తమిళుల ఆరాధ్య దైవంగా భావించే వ్యక్తి మరొకరు. మరి వారెవరో కాదు రజినీకాంత్, శంకర్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శివాజీ,రోబో అటు తమిళంలో ఇటు తెలుగులో ఎంతటి ఘన విజయం సాధించాయో వేరే చెప్పనక్కర లేదు. అయితే  ఆ మధ్య శంకర్ ‘ఐ’ సినిమాతో కాస్త ఖంగు తిన్నాడు. ఎంతో కష్టపడి తీసిన ఈ సినిమా అంతగా సక్సెస్ సాధించలేక పోయింది. ఇక రజినీకాంత్ ‘లింగ’ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. మరి వీరద్దరు ఇప్పుడు మరో సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి అది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయాలని చూస్తున్నారు. మరోసారి మంచి హిట్ సాధించాలనుకుంటున్నారు.

రోబో పోస్టర్


 'శివాజి', 'రోబో' తర్వాత హ్యాట్రిక్‌ హిట్‌ను సొంతం చేసుకునేందుకు రజనీకాంత్‌, దర్శకుడు శంకర్‌ గట్టి  ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటికే కథని, టైటిల్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ మరేదో కాదు 'నంబర్‌ వన్‌' . ఈ టైటిల్ తో గతంలో తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. 


ఇప్పటికే ఈ  చిత్రం కోసం 'నంబర్‌ వన్‌' అనే పేరును శంకర్‌ రిజిస్టర్‌ చేశారని కూడా కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అంతే కాదు ఇటీవల లారెన్స్‌ కూడా రజనీకాంత్‌కు కథ చెప్పినట్లు, సూపర్‌స్టార్‌ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ చిత్రం ముందు రాబోతోందో వేచి చూడాల్సిందే!


మరింత సమాచారం తెలుసుకోండి: