ఒకనాటి తన సన్నిహిత స్నేహితురాలు త్రిష పుట్టినరోజు సందర్భంగా రానా తన పుట్టినరోజు శుభాకంక్షలను తన ట్విటర్ లో తెలియచేసిన సంఘటన త్రిషకు కోపం తెప్పించింది అని అనిపిస్తోంది. 


దీనికి కారణం నిన్న అర్దరాత్రి సరిగ్గా 12 గంటలకు త్రిష పుట్టినరోజు అభినందనలు తెలియచేస్తూ రానా, ఒకప్పుడు వారిద్దరూ సన్నిహితంగా ఉoడే రోజులలో తీయించుకున్న ఒక ఫోటోను తన ట్విటర్ లో పెట్టి తన మాజీ ప్రియురాలకు పుట్టినరోజు అభినందనలు తెలియచేసాడు. 


రానా తన ట్విటర్ లో పెట్టడం త్రిషకు కోపం తెప్పించినట్లు


అయితే ఒకప్పటి తన జ్ఞాపకాలను గుర్తుకు చేసే ఆ ఫోటోను రానా తన ట్విటర్ లో పెట్టడం త్రిషకు కోపం తెప్పించినట్లు ఉంది. అందుకే ఆమె కోపంతో రగిలిపోతు ‘Thank uuuuu Psychooooo’ అంటూ రీ ట్విట్ చేసి రానా మైండ్ బ్లాంక్ చేసింది. వరుణ్ మణియన్ తో పెళ్ళి నిశ్చితార్ధం జరగడానికి ముందు రానా త్రిషల ప్రేమ వ్యవహారం బ్రేకప్ తరువాత తిరిగి వరుణ్ తో త్రిష నిశ్చితార్ధం క్యాన్సిల్ అవుతుంది అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో తిరిగి రానా ఇలా పుట్టినరోజు శుభాకాంక్షల వంకతో త్రిష వైపు చూడటానికి ప్రయత్నించినా త్రిష రానాకు గట్టిగానే సమాధానం ఇచ్చింది అనుకోవాలి. 


త్రిష ఈరోజు తన పుట్టినరోజును చాల జోష్ గా జరుపుకుంటోంది


గోడకు కొట్టిన బంతిలా వేగంగా దూసుకు పోతున్న త్రిష కెరియర్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ వారం బాలకృష్ణతో తాను నటించిన ‘లయన్’ విడుదల అవుతున్న నేపధ్యంలో జోష్ పై ఉన్న త్రిష ఈరోజు తన పుట్టినరోజును చాల జోష్ గా జరుపుకుంటోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: