తెలుగు చిత్ర సీమలో పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. అంతే కాదు ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫుల్ లెంత్ కామిడీ కూడా ఉంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో అంత్యాక్షరి ఎపిసోడ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన గ్యాంగ్ ఇప్పటికీ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లో ఆ ఎపిసోడ్ తో అలరిస్తూనే ఉన్నారు. అంతే కాదు ఈ సినిమాలో విలన్ గా గంభీరంగా కనపడే ఈ గ్యాంగ్ తర్వాత అందరికీ సుపరిచతం అయ్యారు. టీవీ షోలలో పాల్గొని అందిరినీ అలరించారు. అంతే కాదు ‘గబ్బర్ సింగ్’ విడుదలైన తర్వాత ఈ అంత్యాక్షరి గ్యాంగ్ ని తన ఇంటికి పిలిపించుకుని పవన్ కళ్యాణ్ విందు భోజనం ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే.


గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ పోస్టర్


మరి ఈ నెలలో గబ్బర్ సింగ్ 2 షూటింగ్ ప్రారంభించ బోతున్నారు. అయితే ఇదే గ్యాంగ్ ని తన ‘గబ్బర్ సింగ్ 2’లో కూడా నటింపజేయాలని ఫిక్స్ అయ్యాడట పవన్ కళ్యాణ్. ‘గబ్బర్ సింగ్ 2’లో ఈ గ్యాంగ్ తో ఓ కామెడీ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారట. డైరెక్టర్ బాబి దగ్గర పవన్ చెప్పినట్టు సమాచారమ్. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ బాబి కలిసి ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారట. ‘గబ్బర్ సింగ్’ కి మంచి హిట్స్ సాంగ్స్ ని అందించిన దేవి ‘గబ్బర్ సింగ్’ కి కూడా అద్భుతమైన పాటలు అందించాలనే టార్గెట్ తో ఉన్నాడట. వచ్చే యేడాది సంక్రాంతికి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేసారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: