తెలుగు చిత్ర సీమలో అందగాడిగా పేరు తెచ్చుకున్న ప్రిన్స్ మహేష్ బాబుకి తన పిల్లలంటే ఎంతో ఇష్టమట. సినిమాలతో, యాడ్స్ తో ఎంత బిజీగా ఉన్నా తన పిల్లలతో మాత్రం ఖచ్చింతగా గడుపుతాడట. బహుషా ఏ ఇతర హీరోలు కూడా ఇంతగా కుటుంబంతో గడపరట. ముఖ్యంగా మహేష్ బాబుకు తన చిన్న కూతరు సితార అంటే మహా ఇష్టమట. ఇప్పటికే మహేష్ బాబు కొడుకు గౌతమ్ ‘నేనొక్కడినే’ సినిమాలో నటించి ఔరా అనిపించాడు.


మహేష్ బాబు, నమ్రతా శిరోడ్కర్ తో పిల్లలు గౌతమ్, సితార

 
మహేష్ బాబు ఈ మద్య మలేషియా వెళ్లినపుడు తన పిల్లలతో హ్యాపీగా గడిపాడట. తన కూతురు సితారని భుజాలపై ఎక్కించుకుని, తన కొడుకు గౌతమ్ కృష్ణ ప్రక్కనే నడుస్తున్న ఈ ఫొటో చూడండి మీకే అర్దం అవుతుంది.  ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్నాయి.  ప్రస్తుతం  మహేష్ బాబు - ‘మిర్చి' ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర టీం యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో బిజీగా ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: