టెంపర్ హిట్ తో ఎన్టీఆర్ మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే.. అంతే కాదు తన నెక్ట్స్ సినిమా కూడా బంపర్ హిట్ చేయాలనే తలంపుతో ఉన్నాడట.  సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ‘మా నాన్న కోసం’ అనే టైటిల్ ప్రస్తుతానికి ఖరారు చేశారట. వాస్తవానికి ఈ సినిమా టైటిల్ పై ఇప్పటికే కొన్ని వార్తలు వచ్చాయి. మొదట్లో దండయాత్ర అని తర్వాత నాన్న కోసం అని ‘న’ సెంటిమెంట్ తో ఇప్పడు మా నాన్న కోసం అని రక రకాల వార్తలు వినిపించాయి. తండ్రి, కొడుకుల అనుబంధం నేపధ్యంలోనే ఈ చిత్ర కథ ఉంటుందట. కాగా ఫస్టాప్ లో ఎన్టీఆర్ లండన్ లో ఉంటాడు. కాబట్టి లండన్ లోనే తొలి షెడ్యూల్ ని ఆరంభిస్తున్నారు. ముందుగా ఓ భారీ ఫైట్ చిత్రీకరణతో ఈ చిత్రం షూటింగ్ ఆరంభంకానుందని తెలుస్తోంది. భీభత్సమైన ఫైట్ ని చిత్రీకరించబోతున్నారట.


ఫైట్ మాస్టర్  పీటర్ హెయిన్స్


మరి ఎన్టీఆర్ ఫైటింగ్ సీన్లు అంటే ఫైట్ భారీగా ఉండాలి స్టంట్ మాస్టర్ లో సత్తా ఉండాలి. ఫైట్ చిత్రీకరణ భారీగా ఉండటంతో పాటు ఆడియన్స్ కి థ్రిల్ కలిగించాలి. అందుకే ఎన్టీఆర్ తో లండన్ లో చిత్రీకరించబోతున్న ఫైట్ ని సమకూర్చే అవకాశం పీటర్ హెయిన్స్ కి ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్. ఆల్ రెడీ లండన్ బయలుదేరి వెళ్లిపోయాడు పీటర్ హెయిన్స్. అద్భుతంగా ఫైట్ ని చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ సైతం ఈ భారీ ఫైట్ చిత్రీకరణలో పాల్గొనడానికి సమాయత్తమవుతున్నాడని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: