దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాహుబలి’ సినిమా కు సంబంధించిన పోస్టర్లు ఈ నెలమొత్తం హల్ చల్ చేయనున్నట్లు ఇప్పటికే చెప్పారు. అయితే మే డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా మరో పోస్టర్ విడుదల చేశారు.  ఇందులో ప్రభాస్ ‘బాహుబలి’, ‘శివుడు’ అనే రెండు పాత్రలలో నటిస్తున్నాడు.  అయితే తాజాగా   శివుడు పాత్రకు సంబంధించిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. 


మే డే రోజు విడుదల చేసిన  బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్ 


ఆ గంగను మోసిన జంగమదేవుని నెత్తిన 
మోసినదెవడు!
నరనరమున సత్తువ ఉరకలు వేసిన 
నరోత్తముడు ఎవడు!
అంటూ ‘బాహుబలి’ చిత్ర యూనిట్ ప్రభాస్ శివుడు ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.


ఇందులో ప్రభాస్ అద్భుతంగా వున్నాడు.  ఓ శివలింగాన్ని ఎత్తుకొని వున్న ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ప్రభాస్ బాడీ, హెయిర్ స్టైల్ సూపర్ గా వున్నాయి. ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయిన ఈ చిత్రానికి ఈ పోస్టర్ల ద్వారా మరింత రెట్టింపు అవుతున్నాయి.  ఇక ఈనెల 31వ తేది వరకు ఇలాగే ప్రమోషన్ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను ఈనెల 31న విడుదల చేయనున్నారు. జూన్ నెల నుంచి జులై 10 వరకు భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న పాటలను జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: