తెలుగు, తమిళ చలన చిత్ర రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ఏర్పాటు చేసుకుంది అందాల ముద్దుగుమ్మ త్రిష.  అయితే ఈ అమ్మడికి వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం రద్దయి ఇద్దరి మధ్య బ్రేకప్ అయిన తర్వాత  వార్తల్లో బాగా నిలిచింది. ఈ రోజు త్రిష పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులతో కలిసి రహస్య ప్రదేశానికి వెళ్లినట్లు సమాచారం. అయితే మొదటి నుంచి త్రిష జాలీ లైఫ్ గడిపే తార.


ఫ్రెండ్స్ తో త్రిష 


త్రిష పార్టీ కల్చర్ కు అలవాటు పడిన వ్యక్తి. సంతోషకరమైన ఏ సందర్భాన్ని అయినా తన స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఆమెకు అలవాటు. గతంలో ఈ బ్యాచ్ లో వరుణ్ మణియన్ కూడా ఉండే వాడు. త్రిష-వరుణ్ మధ్య ఒకప్పుడు చాలా క్లోజ్ రిలేషన్ షిప్ ఉండేది. మరి అందాల ముద్దగుమ్మ తన బర్త్ డే ఎక్కడ చేసుకుంటుందో ఇప్పటి వరకు తెలియదు. అయితే వరుణ్ మణియన్ ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు త్రిష కన్ను రానా మీద పడినట్లు ప్రచారాలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: