దాసరి నారాయణ రావు, పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఆ మధ్య వార్తలు సోషల మీడియాలో హల్ చల్ చేసిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ విషయంపై దాసరి నారాయణరావు ఓ క్లారిటీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ నిజమైన స్టార్ హీరో. తనతో సినిమా చేయాలనుకోవడం తన గొప్పతనం మాత్రమే. వాస్తవానికి పవన్ తనకు తానే నా వద్దకు వచ్చి మనిద్దరం ఓ మంచి సినిమా తీయాలని అన్నారు. అయితే మొదట్లో అది సరదా అనుకున్నాను కానీ ఆయనకు సినిమాలపై ఉన్న శ్రద్ద నాకు ఆశ్చర్యం కల్గించింది. నిజానికి పవన్ కళ్యాన్ కి ఉన్న ఇమేజ్ ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఏ  డైరెక్టర్ అయినా, నిర్మాతలైన ఆయన చుట్టూ క్యూ కడతారు. కానీ పవన్ కు పెద్ద వాళ్ల పట్ల ఉన్న గౌరవం అపారమైనది.


దాసరి నారాయణ రావుతో పవన్ కళ్యాన్


 ఇది నిజంగా తన గొప్పతనం మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం కథలు వింటున్నానని, ఈ సినిమాను తాను చెయ్యట్లేదని, కేవలం నిర్మాతగా వుంటానని దాసరి చెప్పుకొచ్చాడు. దాసరి మాటలకు పవన్ అభిమానులు చాలా సంతోషంగా వున్నాడు. పవన్ అభిమానులు ఏ వ్యక్తిత్వం, నీతి, నిజాయితీ, ధైర్యం, మంచితనం అనే వ్యక్తిగత అంశాలను చూసి పవన్ కళ్యాణ్ మీద అభిమానం పెంచుకున్నారో.. అది వంద శాతం నిజమేనని మరోసారి అగ్ర దర్శకుడు తన నోటి వెంట చెప్పడంతో పవర్ స్టార్ అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: