తెలుగు చలన చిత్ర రంగం దిగ్విజయంగా 75 వసంతాలు పూర్తి చేసుకొని ముందుకు సాగుంది. ఒకప్పుడు స్టేజీపై నాటకాలు, తోలు బొమ్మల ఆటలతో  ప్రజలల్లో ఆదరణ అభిమానం పొందుతూ వారిని అలరించే వారు.  తరాలు మారుతున్నాయి. కాలంతో పాటు టెక్నాలజీ ముందుకు సాగుతుంది. మరి మన తెలుగు ఇండస్ట్రీకి దార్శనికులుగా నిలిచి తెలుగు ఇండస్ట్రీకి పునాధిరాళ్లు వేసిన మహానుభావుల గురించి తెలుసుకుందాం..


తెలుగు చిత్రపరిశ్రమ 75 వసంతాల లోగో


తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడుగారి సోదరుడు. రఘుపతి వెంకయ్య స్వస్థలం మచిలీపట్నం. 1886 లో ఆయన ఫోటోగ్రఫిపై మనుపడి ఫోటో గ్రఫీ నేర్చుకున్నారు. తర్వాత  17వ యేట నుంచి ఫోటోలు తీయడం మొదలు పెట్టాడు. అప్పటికే ఇంగ్లిష్ వాళ్లు సినిమాలు తీయడం చూసిన ఆయన  1910లో ఒక 'క్రోమో మెగాఫోను'ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. టూరింగ్ టాకీస్ లా  ఓ టెంట్ ఏర్పాటు చేసి టాకీ సినిమాలకు సంగీతం అందించి ప్రజలను ఆకర్షించడం మొదలు పెట్టాడు. 1912లో మద్రాసులో 'గెయిటీ' అనే సినిమా థియేటర్  ప్రారంభించి తెలుగు ప్రజలకు సినిమా రుచిని చూపించాడు. తెలుగు వారికి సినిమాలు చూపించి వినోదం పంచాలనే ధృఢ సంకల్పంతో తన కొడుకు ఆర్.ఎస్.ప్రకాష్ ను సినిమా నిర్మాణం పై ట్రైనింగ్ కోసం విదేశాలు పంపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రకాష్ జర్మనీ, ఇటలీ, అమెరికా దేశాలు పర్యటించాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకుడు  సిసిల్ బి డెమిల్లి ,  'టెన్ కమాండ్‌మెంట్స్’  చిత్రాన్ని నిర్మిస్తున్నపుడు ప్రకాష్ అసిస్టెంట్ గా పనిచేసి మంచి మెలుకువలు నేర్చుకున్నారు. 



టాలీవుడ్ లోగో


భారత దేశానికి తిరిగి వచ్చి ప్రకాశ్ ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్’ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు తీయడం మొదలు పెట్టారు. 1921లో భీష్మప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు. ఇది టాకీ చిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా"రూపొందించిన ఘనత వారికే దక్కింది. ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. ఆ తర్వాత సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయ్యింద. తరువాత ఈ తండ్రీకొడుకులు మత్స్యావతార్, నందనార్, గజేంద్రమోక్షం వంటి మరికొన్ని మూగసినిమాలను తీశారు. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.తరువాత తమిళ సినిమా నిర్మాత ఎ.నారాయణన్‌తో కలిసి 'గ్యారంటీడ్ పిక్చర్స్ కార్పొరేషన్' , 'జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్' స్థాపించారు. విశ్వామిత్ర, మాయామధుసూదన, పాండవ నిర్వహణ, రాజ్ ఆఫ్ రాజస్థాన్ వంటి మరికొన్ని టాకీనిమాలు తీశారు. ఇలా తెలుగు వారికి సినిమా అంటే ఏమిటో తెలియజేసిన ఘనత పొందిన ఆయన 1941 లో తన 69వ ఏట రఘుపతి వెంకయ్య మరణించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: