ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బాహుబలి’ సినిమా విడుదల కు ముందు నుంచే పెద్ద సంచలనం సృష్టిస్తుంది. మే నెలలో బాహుబలి కి సంబంధిచిన పోస్టర్లు విడుదల చేస్తామని చెప్పారు. అదే విధంగా మే డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మహా సంద్రంలో ఒక బాబును చేతులతో ఎత్తుకొని ఉన్న ఆ పోస్టర్ చూస్తుంటే సినిమా మీద భారీ అంచనాలు మొదలైయ్యాయి. ఇక నిన్న విడుదల చేసిన శివుడి పాత్రలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకొని వస్తున్న పోస్టర్ విడుదల చేశారు.   ఇక ప్రభాస్ ని ఆ గెటప్ లో చూసిన ప్రభాస్ అభిమానులతో పాటు మిగతా ప్రేక్షకులు అమితానందం పొందారు. 



మే డే రోజు విడుదల చేసిన బాహుబలి ఫస్ట్ లుక్


సిక్స్ ప్యాక్ లో ఉన్న ప్రభాస్ శివ లింగాన్ని ఎత్తుకొని వస్తున్నప్రభాస్ గెటప్ నెట్ లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది . ఇక ఇదే గెటప్ ని హిందీ లోనూ అలాగే తమిళంలోనూ రిలీజ్ చేసారు కరణ్ జోహార్ ,జ్ఞానవేల్ రాజా . ఈనెల 31న బాహుబలి ట్రైలర్ ని రిలీజ్ చేసి జూలై 10న సినిమా రిలీజ్ చేయనున్నారు. రాజమౌళి చెప్పినట్లు చలన చిత్ర రంగంలో ఇదో పెద్ద సంచలన చిత్రంగా మిగిలి పోతుంది అనటంలో ఆశ్చరం లేదు అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: