కాకతీయుల  వీరనారీమణి రాణి రుద్రమదేవి వీరగాధను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దర్శకుడు గుణశేఖర్ ఇప్పడు ఓ టెన్షన్ పట్టి పీడిస్తుంది. అనుష్క ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో గుణశేఖర్ రూపొందించిన చిత్రం ‘రుద్రమదేవి’. భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రం ‘రుద్రమదేవి’. ఫస్ట్ లుక్ విడుదలైనప్పట్నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఏ న్యూస్ గుణశేఖర్ ఇప్పటి వరకు చెప్పలేదు. అయితే గతంలో ఈ చిత్రాన్ని మే ఫస్ట్ వీక్ లో విడుదల చేస్తామని చెప్పారు కానీ ఆ సన్నాహాలు ఏమాత్ర కనబడటం లేదు. కనీసం చిత్రానికి సంబంధించిన విడుదల పోస్టర్లు కూడా ఇప్పటి వరకు రాలేదు. అయితే ఈ సినిమాకు సంబంధించి  గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేదు. 


రుద్రమదేవి పోస్టర్ 


ఇప్పడు గుణశేఖర్ కి బయ్యర్ల ప్రాబ్లం వచ్చిపడిది. సినిమా పంపిణీ చేస్తానని వారి వద్ద నుంచి అడ్వాన్స్ తీసుకున్న గుణశేఖర్ సినిమా ఎప్పడు విడుదల చేస్తారు అన్న ప్రశలు బయ్యర్లు వేస్తున్నారట. ఈ సినిమా మే ఫస్ట్ వీక్ లో విడుదల అవుతుందని ఆశించినప్పటికీ అది జరగలేదు. మే చివరి వారంలో సినిమాని విడుదల చేయాలని, లేని పరిస్థితుల్లో తాము ఇచ్చిన ఆడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని గుణశేఖర్ కి డెడ్ లైన్ పెట్టారట బయ్యర్లు. దీంతో గుణశేఖర్ టెన్షన్ లో పడిపోయాడని సమాచారమ్. నెలాఖరులోపు వర్క్ అంతా పూర్తి చేసి విడుదల చేయడమంటే చాలా కష్టమని భావిస్తున్నాడట గుణశేఖర్. మరి ఈ నెలాఖరుకు సినిమాని విడుదల చేయకపోతే బయ్యర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? 


రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ 



మరింత సమాచారం తెలుసుకోండి: