త్రిష అంటే నిషా అన్నట్లే తెలుగు, తమిళ చిత్రాల్లో ఈ అమ్మడు దాదాపు అగ్ర హీరోలతో నటించింది. మంచి హిట్లు ఖాతాలో వేసుకుంది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు దర్శక నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఇప్పుడు త్రిష లిప్ లాక్ సీన్లకు, గ్లామర్ రోల్స్ కి ఫుల్ పర్మిషన్ ఇచ్చేసిందట. వరుణ్ మణియన్‌తో వివాహ నిశ్చితార్థం రద్దయినట్లు త్రిష గురించిన వార్తలు వెలువడుతున్నా, దీని గురించి నోరు మెదపకుండా కొత్త చిత్రాలకు కాల్షీట్లు ఇవ్వడంలోనే ఆమె బిజీగా ఉన్నారు.


భూ లోకం, అప్పాటక్కర్, లయన్ (తెలుగు) చిత్రాల తర్వాత సెల్వరాఘవన్ దర్శకత్వంలో సింబుతో నటిస్తున్నారు.  సింబుతో నటించిన త్రిష సెల్వరాఘవన్ చిత్రంలోను అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం కమల్‌తో నటిస్తున్న చిత్రంలో ఆయనకు జంట గా నటిస్తున్నారు. అందువల్ల ఇక్కడ ముద్దులకు కొదువే ఉండబోదని చిత్రవర్గాలు తెలుపుతున్నాయి. ఇక త్రిష ముద్దుల సీన్లతో సినీ ప్రేక్షకులకు సందడే సందడి..


మరింత సమాచారం తెలుసుకోండి: