ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా అంటూ వర్షం సినిమాలో హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రకారు మనసు దోచిన అందాల భామ త్రిష ఇప్పుడు వార్తలో టాక్ ఆప్ ది టౌన్ గా మారింది.  తమిళ నాడుకు చెందిన    పెద్ద వ్యాపారవేత్త  , తమిళ చిత్రాల నిర్మాత అయిన వరుణ మణియాన్ తో ప్రేమ వ్యవహారం నడిచిందట అంతేకాదు పెద్ద అంగీకారంతో నిశ్చితార్థం కూడా అయ్యింది. నిశ్చితార్థం జరిగి మూడు నెలలు పైనే అయినా ఇంకా మూడుముళ్ల బంధానికి సంబంధించిన తేదీని ప్రకటించలేదు. ఈలోపు వరుణ్, త్రిషల మధ్య మనస్పర్థలు వచ్చాయనే ఊహాగానాలు నెలకొన్నాయి.



వరుణ్ మనియార్ ట్విట్


అవి ఊహాగానాలు కాదు.. నిజమేననిపిస్తోందని కొంతమంది బలంగా చెబుతున్నారు. దానికి కారణం…త్రిష..ఫియాన్సి వరుణ్, త్రిష ల వ్యవహారం రోజు రోజుకూ ముదురుతూ షాక్ ఇస్తోంది. వరుణ్ మణియన్ తన ట్విట్టర్లో పేరు చెప్పకుండా ఎవరినో ‘స్లట్’ అన్నాడు. దీని అర్థం ‘పతిత’ అని ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది. మనోడికి త్రిషపై ఉన్న అక్కసు కోపం. కాస్సేపటికే త్రిష అతన్ని ట్విట్టర్ లో అన్ ఫాలో అయ్యింది. మరేమనుకున్నాడో ఏమో కానీ వెంటనే  స్లట్ అని పెట్టిన ట్వీట్ ని డిలేట్ చేసేసాడు. అప్పటికే వీరి ట్విట్స్ ఫాలో అయ్యేవారు చూసి ఆశ్చర్యపోయారు. ఇది వెంటనే మీడియాకు పాకేసింది. మరి దీనిపై త్రిష ఏవిధంగా స్పందిస్తుంతో వేచి చూడాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: