హృదయ కాలేయంతో తెలుగు ప్రేక్షకులకు బర్నింగ్ స్టార్ గా పరిచయం అయిన సంపూర్ణేష్ బాబు అదృష్టం పడిశం పట్టినట్టు పట్టిందట. వాస్తవానికి హృదయ కాలేయంలో మనోడి యాక్షన్ అంతంత మాత్రమే అయినా పంచ్ డైలాగులతో అందరి మన్ననలు పొందాడు. తర్వాత రెండు సినిమాల్లో కాస్త మెచ్యురిటీగా కనిపించాడు.   మనోడు క్రేజీ కాంబినేషన్ అదే నండి మంచు విష్ణు నిర్మాతగా సంపూ హీరోగా ‘సింగం 123’ సినిమా వస్తుంది. అంతే కాదు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సంపూర్ణేష్ బాబును బాగా పొగుడుతున్నాడు.  అంతేనా.. వీరి కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్ల నుంది.



 సంపూర్ణేష్ బాబు  ‘సింగం 123’ పోస్టర్


ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ దర్శక రత్న దాసరి నారాయణ రావు సంపూర్ణేష్ బాబు తో సినిమా తీయాలని నిశ్చయించాడు ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పాడు. అయితే ఈసినిమాకి దాస‌రి కేవ‌లం నిర్మాత‌గానే వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలిసింది. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది త్వ‌ర‌లో చెబుతామన్నారు. మొత్తానికి సంపూ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టుంది కదా..!

మరింత సమాచారం తెలుసుకోండి: