హిట్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను ముంబైలోని సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఈమేరకు ఇవాళ తీర్పు చెప్పింది. ప్రమాద సమయంలో కారు నడిపింది సల్మాన్ ఖానే అని నిర్దారించింది. ప్రమాద సమయంలో సల్మాన్ కారు నడపలేదని, సల్మాన్ డ్రైవర్ కారు నడిపాడని డిఫెన్స్ న్యాయవాది చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. సల్మాన్ పై నమోదైన 8 అభియోగాలు రుజువయినట్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.  


సల్మాన్ ఖాన్


తీర్పుపై సినీ ఇండ్రస్ట్రీ, అభిమానులు, సల్మాన్ నిర్మాతగా సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ తీర్పుపై బాలీవుడ్ నిర్మాతల్లో చాలా మంది తలరాతలున్నాయి అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. 2002 సెప్టెంబర్‌లో సబర్బన్‌ బాద్రాలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తులపై సల్మాన్‌ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సల్మాన్‌పై ఐపీఎస్‌ 304 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. విచారణలో భాగంగా 21 మంది సాక్షులను న్యాయస్థానం విచారించగా, ఒకరు మినహా 20 మంది ఆయనకు వ్యతిరేకంగా సాక్షం చెప్పారు. ఘటన తరువాత 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం నేడు ఉదయం 11.15 గంటలకు తీర్పు వెలువడించింది.  ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే వెలువరించనున్నారు.  నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. కోర్టు ఆవరణలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: