ఈరోజు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక త్రిష వరుణ్ ల బ్రేకప్ కు సంబంధించిన విషయమై లోతైన కారణాలను విశ్లేషిస్తూ ప్రచురించిన న్యూస్ దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి హాట్ న్యూస్ గా మారింది. త్రిష బ్యాంకాక్ లో తన పుట్టినరోజు సందర్భంగా తన సన్నిహితులకు ఏర్పాటు చేసిన పార్టీలో త్రిష తన ప్రేమికుడు వరుణ్ మన్యన్ తో జరిగిన నిశ్చితార్దాన్ని మరిచి పోవడానికి నిశ్చయించుకున్నట్లుగా స్పష్టమైన సంకేతాలను తన సన్నిహితులకు ఇచ్చింది అని తెలుస్తోంది.

ఇక ఈ బ్రేకప్ కు వెనుక కల కారణాలను  ఆ ప్రముఖ దిన పత్రిక విశ్లేషిస్తూ అనేక ఆసక్తికర విషయాలను బయట పెట్టింది. త్రిషను పెళ్ళి చేసుకోవడం వరుణ్ తల్లి తండ్రులకు మొట్టమొదటి నుంచి ఇష్టం లేదని ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా పేరు గాంచిన తమ కుటుంబంలోకి ఒక సినిమా హీరొయిన్ ను కోడలుగా అంగీకరించడానికి వరుణ్ తల్లి తండ్రులు చాల ఇబ్బంది పడ్డారు అనే షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది ఆ పత్రిక.

అదేవిధంగా నిశ్చితార్ధం జరిగిన తరువాత వరుణ్ త్రిషను తాను ఒప్పుకున్న సినిమాలను త్వరగా పూర్తి చేయడమే కాకుండా కొత్త సినిమాలను ఒప్పుకో కూడదని కండిషన్ పెట్టాడని ఆ పత్రిక కథనం. అయితే ఈ కండిషన్ కు షాక్ అయిన త్రిష తన సినిమాల విషయంలో వరుణ్ పెత్తనం ఏమిటి అంటూ అతడిని ప్రశ్నించడమే కాకుండా మరింత స్పీడ్ తో త్రిష సినిమాలను ఒప్పుకోవడం వరుణ్ కు రిమ్మతిరిగే షాక్ గా మారింది అని ఆ పత్రిక అభిప్రాయ పడింది.

దీనికి తోడు త్రిష వరుణ్ ల ఎంగేజ్ మెంట్ రోజున వచ్చిన అతిధులలో రజినీకాంత్ అల్లుడు ధనుష్ ని చూడగానే వరుణ్ కు కోపం వచ్చిన సంగతిని కూడా ఆ పత్రిక బయట పెట్టింది. వరుణ్ కు ధనుష్ కు ఒక విషయమై వచ్చిన భేదాభిప్రాయాలతో ధనుష్ ను వరుణ్ శత్రువుగా భావిస్తున్న నేపధ్యంలో తన ఎంగేజ్ మెంట్ కు ధనుష్ ఎందుకు వచ్చాడని త్రిషను ప్రశ్నిస్తే అతడు తన అతిధిగా వచ్చాడని త్రిష సమాధానం చెప్పిన నాటి నుండి వరుణ్ త్రిషతో మాట్లాడటం మానివేయడమే కాకుండా ఆమెను మరింత దూరం పెడుతూ వస్తున్నాడని దీనితో విసికి పోయిన  త్రిష వరుణ్ పై మరింత దూకుడును పెంచడంతో ఈ ప్రేమ జంట పెళ్ళి పీటలు ఎక్కకుండానే విడిపోయింది అంటూ ఒక ఆసక్తి కధ నాన్ని ప్రచురించింది ఆ జాతీయ పత్రిక..








మరింత సమాచారం తెలుసుకోండి: