తెలుగు చిత్ర సీమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ‘బాహుబలి’ సినిమా కు సంబంధించిన పోస్టర్లు మే నెలలో ఒక్కొక్కటి విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి చెప్పారు. అదే విధంగా మేడే రోజు బాహుబలి ఫస్ట్ లుక్ తో కూడిన పోస్టర్ విడుదల చేశారు. సోమవారం ఆయన విడుదల చేసిన హీరో ప్రభాస్ 'శివుడు' పోస్టర్  సోషల్ మీడియాలో ఎంతో హల్ చల్ చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానుల ఏ మేరకు అంచనాలు వేసుకున్నారో దానికి మించిన విధంగా ఉన్నాయని అందరూ సంతోషం వ్యక్తం చేశారు.


ఈ మధ్య విడుదల చేసిన బాహుబలి పోస్టర్లు


పోస్టర్లకు వచ్చిన రెస్పాన్స్ చూసి రాజమౌళి ఎంతో ఆనందంలో ఉన్నాడు. దానికి  కృతజ్ఞతలు చెబుతూనే 'దేవసేన' అనుష్క పోస్టర్ను బుధవారం విడుదల చేస్తున్న విషయాన్ని తెలిపారు. అందాల రాశి అనుష్క ‘దేవసేన’ అనే కీలకమైన  పాత్రలో అలరించబోతున్నట్లు అయితే ఈ పాత్ర రెండవ భాగంలో ఉంటుందట. కాకపోతే మొదటి భాగంలో వేరే పాత్రలో కొద్దిసేపు అనుష్క కనిపిస్తుందని జక్కన్న చెప్పారు.

అనుష్క ఫోటో ట్విట్ చేసిన రాజమౌళి


మరింత సమాచారం తెలుసుకోండి: