బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా రకాల ఈవెంట్స్ జరుగుతుంటాయి. హీరో, హీరోయిన్స్ మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ, ఆ ఈవెంట్ లో మాత్రం వారు కలిసిపోతారు. సరిగ్గా అలాంటి ఓ సందర్భం ఇద్దరి హీరోయిన్స్ మధ్య జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, చలనచిత్రరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరచి జాతీయ ఉత్తమ నటీమణులుగా అవార్డులు అందుకున్న బాలీవుడ్ తారలు ప్రియాంకచోప్రా, కంగనారనౌత్ మరోసారి తళుక్కుమన్నారు.

మేరీకోమ్ చిత్రంలో ప్రియాంక, క్వీన్ సినిమాలో కంగనారనౌత్ చేసిన అభినయానికి వారికి జాతీయ అవార్డులతోపాటు విమర్శకుల ప్రశంసలు అందిన విషయం తెలిసిందే.

రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా అవార్డులు అందుకున్న వీరు సన్నిహితులకు ఇచ్చిన విందు కన్నులపండువగా సాగింది. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు ఎందరో హాజరయ్యారు.

విద్యాబాలన్, శ్రద్ధాకపూర్, అమీర్‌ఖాన్‌ సహా పలువురు అతిథులు ఈ విందుకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రియాంక చోప్ర, కంగనా రనౌత్ ఇద్దరూఒ కరికొకరు ముద్దుపెట్టుకుంటూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: