జైలు శిక్ష పడిన ఖైదీలకు జైలులో అప్పనంగా కూర్చోబెట్టి భోజనం పెట్టారు. వారితో ఏదో ఒక పనిచేయిస్తూ ఉంటారు. ఇలా ఖైదీలు రకరకాల పనులు చేస్తుండడం... విడుదల అయ్యేప్పడు కాసిని మిగిలిన కూలి డబ్బులు ఇంటికి తీసుకెళ్లడం మనం సినిమాల్లో చూస్తుంటాం. మరి ఇప్పుడు తాజాగా జైలు శిక్ష పడిన హీరో సల్మాన్‌ఖాన్‌కు జైల్లో ఏం పని అప్పగిస్తారు?


ఈ చర్చకు ఇంకా కాస్త సమయం ఉంది. ఎందుకంటే ముందు ఆయన బెయిల్‌ పిటిషన్లు రద్దు కావాలి. ఆయన శిక్ష అనుభవించడానికి జైల్లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఆయనకు ఎలాంటి పని అప్పగించాలి అనే సంగతిని జైలు అధికారులు నిర్ణయిస్తారు. 


బాలీవుడ్‌లో దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన సినిమా


అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సల్మాన్‌ ఖాన్‌ కు ఇప్పుడు హఠాత్తుగా జైలుశిక్ష పడడం వలన బాలీవుడ్‌లో దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన సినిమా వ్యాపారం అడ్డంగా మునిగిపోయే ప్రమాదం ఉంది. సినిమాలు ఆగిపోతే నిర్మాతలు మొత్తం బుక్కయిపోతారు. ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్‌లో ఒక వాదన వినిపిస్తోంది. సల్మాన్‌ జైలు ఖైదీగానే పరిగణిస్తూ.. ఆయనతో షూటింగులు చేయడానికి అనుమతించాలనేది వారి వాదన. సల్మాన్‌ఖాన్‌తో వడ్రంగి పనిచేయించడం ద్వారా జైలుకు వచ్చే ఆదాయం కంటె.. సల్మాన్‌తో నటింపజేస్తే.. జైలుకు వచ్చే ఆదాయం చాలా ఎక్కువ. కావలిస్తే నటించినందుకు సల్మాన్‌కు అందే రెమ్యూనరేషన్లను ఆయన ఖైదీ గనుక.. జైళ్లశాఖ వారే అధికారికంగా తీసుకోవచ్చు కూడా అని పలువురు సూచిస్తున్నారు. 


సల్మాన్‌ తప్పు చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు


సల్మాన్‌ తప్పు చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అది హత్య కాదు. నేరం అనడం కంటె ఆయన చేసిన తప్పు అనడం ఒక రకంగా సబబుగా ఉంటుంది. ఒక రంగంలో స్కిల్‌ ఉన్న వ్యక్తి.. అనుద్దేశ్యంగా ఒక తప్పు చేయడం వలన శిక్షకు గురయ్యాడంతే. అందువలన అయిదేళ్లపాటూ ఆయన స్కిల్‌ను వృథా చేయడం కంటె.. దాన్ని కనీసం జైళ్లశాఖ అయినా సద్వినియోగం చేసుకుంటే.. ఆయన మీద ఆధారపడిన సినిమా వ్యాపారం నిట్టనిలువునా మునిగిపోకుండా ఉంటుంది కదా! అనేది ఆలోచన. మరి ఇలాంటి సరికొత్త వాదనకు జైళ్ల చట్టాలు ఎలా స్పందిస్తాయో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: