టాలీవుడ్ సినిమా రంగంలో మెగా హీరోలకు కాలం కలిసి వచ్చినంతగా మరే హీరోకు కాలం కలిసి రాదు అని అంటారు. ఈ విషయంలో అల్లుఅర్జున్ మొదటి వరసలో ఉంటాడు. నిన్నటితో బన్నీ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విడుదలై నాలుగు వారాలు పూర్తి కావడంతో బన్నీ అదృష్టం మరోసారి బయట పడింది.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ నాలుగు వారలు పూర్తి చేసుకునే సరికి ఇప్పటి వరకు మన ఇరు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు దరిదాపు 49 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ టాప్ 10 సినిమాలలో 7 స్థానంలో నిలిచింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో అల్లుఅర్జున్ వరసగా డబల్ ఫిఫ్టీ కలెక్షన్స్ రికార్డులను అందుకోబోతున్న తొలి హీరోగా మారబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. 

మొదట్లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాకు వచ్చిన డివైడ్ టాక్ విన్న తరువాత ఈ సినిమా 40 కోట్ల మైలురాయిని చేరుకోవడమే కష్టం అని అనుకున్నారు అంతా. అయితే ఈ సినిమా విడుదల తరువాత మరి ఏ టాప్ హీరో సినిమా విడుదలకాకపోవడం బన్నీకి అదృష్టంగా మారి నెమ్మదినెమ్మదిగా ఒకొక్క గండాన్ని దాటుకుంటూ 50 కోట్ల కలెక్షన్స్ మైలురాయి దగ్గరకు బన్నీ చేరిపోయి క్రితం సంవత్సరం ‘రేసుగుర్రం’ హవాను కొనసాగిస్తున్నాడు బన్నీ.

అయితే అల్లుఅర్జున్ ఈ డబల్ ఫిఫ్టీ రికార్డు అదృష్టాన్ని చేరుకోవడానికి  దరిదాపులో ఉండటంలో బాలకృష్ణ సహకారం కూడా ఉంది అనుకోవాలి. మే 1న విడుదల అవుతుంది అనుకున్న బాలయ్య ‘లయన్’ ఆ తరువాత మే 8కి మారి ఇప్పుడు ఏకంగా మే 14కు వెళ్ళి పోవడంతో అల్లుఅర్జున్ డబల్ ఫిఫ్టీ కలెక్షన్స్ రికార్డ్ కు ఎటువంటి ఆటంకం లేకుండా పరిస్థుతులు ఏర్పడటంలో  బాలకృష్ణ – అల్లుఅర్జున్ కు అదృష్టంగా మారాడు అనుకోవాలి. అదృష్టం తలుపు కొడితే అలాగే ఉంటుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: