అత్తారింటికి దారేది వంటి సెన్సేషనల్ హిట్ సినిమా అందించిన త్రివిక్రమ్ ఇప్పడు పవన్ కళ్యాన్ తో మరో మూవీకి సిద్దం అవుతున్నాడు. వాస్తవానికి ఈ సినిమా అయిపోయిన తర్వా వెంటనే సెట్స్ పైకి రావాల్సి ఉండేది కాని పవన్ కళ్యాన్ కి తీరిక లేకపోవడంతో కాస్త గ్యాప్ వచ్చింది. పవన్, త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘కోబలి’ సినిమా త్వరలో సెట్స్ పైకి రాబోతుందని సమాచారం.


కోబలి ఫ్యాన్స్ మేడ్ పోస్టర్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించే గబ్బర్ సింగ్ 2 ఈ నెల 29 నుండి సెట్స్ పైకి రానున్న విషయం తెలిసిందే. ఇటివలే అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని రూపొందించిన త్రివిక్రమ్ కు ఆ సినిమా అనుకున్న స్తాయిలో విజయాన్ని అందించ లేకపోయింది, కలెక్షన్స్ మాత్రం ఓకే అనిపించుకుంది. దీంతో కసితో ఉన్న త్రివిక్రమ్ ఈ సారి పవన్ కళ్యాన్ తో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.


దర్శకుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాన్


అందుకే పవన్ తో రూపొందించే కోబలి సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు అప్పుడే మొదలు పెట్టాడు. సో త్వరలోనే వీరి కలయికలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. రాయలసీన సంప్రదాయాలపై రూపొందే సినిమా ఇది ? త్వరలోనే అధికారిక వార్తలు వచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: