నిన్న మంచు మనోజ్ పెళ్ళి సందడిలో పవన్ తన అవతారంలో ఎటువంటి మార్పు లేకుండా పవన్ బాబా అవతారంతో సందడి చేయడంతో పవన్ గెడ్డం గీసుకుని ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకు రెడీ అవుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలకు భిన్నంగా కనిపించడంతో పవన్ లుక్ చూసిన వారు ఈ నెలాఖరుకు కూడ ‘గబ్బర్ సింగ్ 2’ షూటింగ్ కు రెడీ అవ్వడం కష్టమే అన్న నిర్ణయానికి వచ్చేశారు. 

అయితే ఆ పెళ్ళికి వచ్చిన మరి కొంత మంది అతిధులు మరో విశ్లేషణను బయటకు తీసారు. పవన్ తన ‘గబ్బర్ సింగ్ 2’ ను ఈ నెలాఖరుకు మొదలు పెట్టి వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేద్దాము అని అనుకుంటున్న నేపధ్యంలో చిరంజీవి 150వ సినిమా అధికారిక ప్రకటన రావడమే కాకుండా ఆ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి రేసుకు విడుదల కాబోతూ ఉండటంతో తన అన్న చిరంజీవి సినిమాతో పోటీకి వెళ్ళడం ఇష్టం లేక పవన్ తన ‘గబ్బర్ సింగ్ 2’ విషయంలో మరికొంత సమయం తీసుకుంటు హాయిగా తన పెరిగిన జుట్టును గెడ్డాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ సెటైర్లు కూడ పడ్డాయని టాక్.

ఈ వార్తలు ఇలా ఉండగా నిన్న ఒక ప్రముఖ పత్రిక పవన్ ఇప్పట్లో రాజధాని రైతుల గురించి నిరశన దీక్షలు చేసే ఉద్దేశ్యంలో లేడు అంటూ ఒక వార్తను ప్రముఖంగా ప్రచురించింది. దీనితో పవన్ పోరాటం చేస్తాడు అనే వార్తలు కూడా గాలి వార్తలుగా మిగిలి పోతాయా అనే అనుమానం మళ్ళీ మొదలైంది. దీనికి తోడు త్వరలో అంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు జరగబోతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సహకారంతో భారతీయ జనతాపార్టీకి లభించిన ఒక ఎమ్.ఎల్.సి స్థానానికి భారతీయ జనతాపార్టీ తరఫున పవన్ కు అత్యంత సన్నిహితుడైన సోము వీర్రాజు ఎంపిక అయ్యాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ ఎంపిక వ్యవహారంలో పవన్ సోము వీర్రాజుకు సహకరించాడా? అనే వార్తలు కూడ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. 

ఈ వార్తలే నిజం అయితే తన అన్న చిరంజీవి కోసం ‘గబ్బర్ సింగ్ 2’ ను తన సన్నిహితులకు పదవులు రావడానికి తన నిరశన దీక్షలను వాయిదా వేసుకుంటూ పవన్ అనేక త్యాగాలు చేస్తూ త్యాగాల బాబాగా చరిత్రలో మిగిలిపోతాడేమో అనే సందేహం కలగడం వాస్తవం..
 



మరింత సమాచారం తెలుసుకోండి: