టాలీవుడ్ యంగ్ హీరో నాని తన సినిమాలకు సంబంధించి అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తన పేస్ బుక్ లో ట్విటర్ లో తన అభిమానులతో షేర్ చేసుకుంటూ తన అభిమానుల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతేకాదు అప్పుడప్పుడు సరదాగా తన తోటి యంగ్ హీరోల విషయాల పై అలాగే సామాజిక విషయాల పై కూడ తన కామెంట్స్ ను పెడుతూ అందరికీ చేరువ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.


మంచు మనోజ్ కు పెళ్ళి చేసుకునే ముందు ఏమైనా సలహాలు ఇచ్చారా


వెబ్ మీడియాలో తన పేస్ బుక్ ద్వార తన అబిమానులతో చాటింగ్ చేసే నానీని ఒక అభిమాని మంచు మనోజ్ కు అతడు పెళ్ళి చేసుకునే ముందు ఏమైనా సలహాలు ఇచ్చారా? అంటూ కొంటెగా ప్రశ్నిస్తే నానీ అoతకన్నా జోక్ గా తన పేస్ బుక్ చాటింగ్ లో కామెంట్ చేసాడు అని తెలుస్తోంది.


‘నా సలహా విని ఉంటే పెళ్ళి చేసుకునేవాడు కాదు’ అంటూ నాని


‘నా సలహా విని ఉంటే పెళ్ళి చేసుకునేవాడు కాదు’ అంటూ నాని మంచు మనోజ్ పెళ్ళి పై సరదాగా జోక్ చేసాడు అని తెలుస్తోంది. అయితే ఈ కామెంట్స్ సరదాగా చేసినట్లు అనిపించినా పెళ్ళికి ముందు నాని మంచు మనోజ్ కు ఏ సలహా ఇచ్చాడు అనే విషయం పై ఎవరికైనా ఆసక్తి పెరుగుతుంది అన్నది వాస్తవం.

ఈ విషయం ఇలా ఉండగా నిన్న అత్యంత ఘనంగా జరిగిన మంచువారి పెళ్ళి వేడుకలలో టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ కు చెందిన  అక్కినేని ఫ్యామిలీ, రామానాయుడు ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ లాంటి కొందరు ప్రముఖ వ్యక్తులు మంచు వారి పెళ్ళి సంబరాలలో కనిపించక పోవడం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు మంచు విష్ణు మనోజ్ లతో నటించిన హీరోయిన్స్ ఎవ్వరూ కూడ మంచు మనోజ్ పెళ్ళి వేడుకలలో సందడి చేయక పోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: