మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక పై దర్శకుడు పూరి జగన్నాథ్ తన దృష్టి పెట్టడంతో ఈ విషయంలో చిరంజీవికి తన సొంత కుటుంబ సభ్యుల నుండి వస్తున్న అభ్యర్ధనలు షాకింగ్ గా మారాయి అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో అయినా కనిపించాలి అన్న కోరికను వ్యక్త పరిచిన రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ కూడా జత కలవడంతో చరణ్ బన్నీలకు వారి స్థాయికి తగ్గట్టుగా చిన్నచిన్న అతిథి పాత్రలు తన 150వ సినిమాలో క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలను చిరంజీవి పూరీతో చర్చిస్తున్నాడని టాక్.

అయితే లేటెస్ట్ గా ఈ లిస్టులో మెగా కుటుంబ యువ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు కూడా చేరిపోయి తమకు కూడా ఒక్క నిముషం అయినా చిరంజీవితో నటించే అవకాశం ఇమ్మని స్వయంగా వీరంతా చిరంజీవినే అడుగుతూ ఉండటంతో చిరంజీవి ఈ అనుకోని పరిణామానికి ఆశ్చర్య పడటమే కాకుండా ఇంతమందిని తన 150వ సినిమాలో ఎలా ఇరికించేది అని ఆలోచిస్తున్నట్లు మాటలు వినపడుతున్నాయి. అయితే ఇంతమంది మెగా కుటుంబ హీరోలు చిరంజీవి 150వ సినిమాలో కనిపించి పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించకుండా ఉంటే అది మెగా అభిమానులాకు తప్పుడు సంకేతాలను అందచేస్తుందని చిరంజీవి వ్యక్తిగతంగా భావిస్తున్నాడని కొందరి అభిప్రాయం. 

ఈ విషయంలో పవన్ అభిప్రాయం ఏమిటో తెలుసుకుని పవన్ కు కూడ తన సినిమాలో ఒక ప్రత్యేక పాత్రను చేస్తాను అంటే ఒక పాత్రను క్రియేట్ చేస్తే బాగుంటుందని కొందరు సన్నిహితులు ఇస్తున్న సలహా మేరకు చిరంజీవి పవన్ వద్దకు రాయబారాలు చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడని టాక్. అది కుదరక పోతే మెగా కుటుంబ హీరోల ప్రత్యేక పాత్రలు లేకుండానే  తన 150వ సినిమాను పూర్తి చేసే ఉద్దేశ్యంలో చిరంజీవి ఉన్నాడు అనే వార్తలు కూడ ఉన్నాయి. ఏవిధంగా చూసినా చిరంజీవి మెగా హీరోల స్కెచ్ లో చిక్కుకున్నాడనే అనిపిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: