తెలుగు ఇండస్ట్రీలో హ్యండ్సమ్ బ్యాచ్ లర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మరి ఈయన ఇంట్లో పెళ్లి బాజా ఎప్పుడు మోగుతుందీ అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ 35 ఏళ్లలో పడ్డాడు. వాస్తవానికి ప్రభాస్ కి రెండేళ్ల క్రితమే పెళ్లి కావాల్సి కానీ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దిన ‘బాహుబలి’ సినిమా కోసం మనోడు పూర్తి కమిట్ మెంట్ తో నటించాడు మధ్యలో ఎలాంటి సినిమాలు కానీ పెళ్లి విషయం కానీ ప్రస్తావించకుండా సినిమాపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాడు. మరి తోటి  యువ హీరోలంతా టకటకా పెళ్లి భాజాలు మోగించారు .

బాహుబలి సినిమాలో ప్రభాస్ స్టిల్స్


ఎన్టీఆర్ ,బన్నీ ,చరణ్ , గోపీచంద్, నిన్ననే మంచు మనోజ్ కూడా ఓ ఇంటి వాడయ్యాడు ఇక ఈనెలాఖరున అల్లరి నరేష్ కూడా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నాడు. అంతేనా వీరిలో  ఎన్టీఆర్,బన్ని,గోపీచంద్ లాంటి వాళ్లు పండంటి మగబిడ్డలకు తండ్రులు కూడా అయ్యారు. మరి మిగిలిన హీరో ప్రభాస్ ఒక్కడే !  బాహుబలి   సినిమా కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేసాడు కానీ ఇకనైనా బ్యాచిలర్ లైఫ్ కి బై చెప్పి ఓ ఇంటివాడు అయితే బాగుంటుందని అంటున్నారు.  అయితే ప్రభాస్ కూడా పెళ్లి విషయంలో తొందర పడుతున్నట్లే కనబడుతుంది,  మనోడికి ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నాడు అతడి పెదనాన్న కృష్ణంరాజు. వచ్చే ఏడు ప్రభాస్ ఇంట్లో పెళ్లి భాజా మోగుతుందనే అనుకుంటున్నారు ఆయన అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: