తెలుగు చిత్ర సీమలో కొత్త హీరోయిన్ల హవ్వా కొనసాగుతుంది. ముఖ్యంగా రకూల్ ప్రీతి సింగ్, రాశీఖన్నా,రెజీనా, శ్రతిహాసన్ లాంటి హీరోయిన్లు టాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోయిన్లు.   తాజాగా ఊహలు గుసగుసలాడే’ సినిమాతో బబ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా ముద్దుగా బొద్దుగా చాలా అందంగా అందరినీ ఆకర్శించింది. తర్వాత వచ్చిన  ‘జోరు’ సినిమాలో  తన అందాలు ఆరబోసి కుర్రకారు మనసు దోచేసింది. అంతే కాదు ఈ అమ్మడు ఆ సినిమా ‘జోరు పప్పర పప్పా’ అంటూ జోరుగా పాటపాడి సోషల్ మీడియాల్ హల్ చల్ చేసింది.


రాశీ ఖన్నా హాట్ ఫోటో


ఆ తర్వాత రాశిఖన్నా నటించిన ‘జిల్’ సినిమా హిట్టవ్వడంతో... ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి, ముఖ్యంగా ఈ సినిమాల గోపిచంద్ తో లిప్ లాక్ కిస్ సీన్ అందరినీ ఇట్టే కట్టి పడేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘బెంగాల్ టైగర్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మాంచి కిక్కెంచే మాస్ మసాలా సాంగ్ ఉందట ఈ పాటలో రాశీఖన్నా హాట్ హాట్ గా కనబడబోతుందట అయితే పాట షూటింగ్ లో రాశీఖన్నా   వేసుకున్న డ్రెస్సును సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అసలే తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉండే ఈ అందాల భామ ఈ డ్రెస్ లో చాలా క్యూట్ గా కనబడుతుంది. ఈ డ్రెస్ లో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో... ఈ అమ్మడి ఫ్యాన్స్ తెగ ముద్దులిచ్చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: