ఆడంబరాలకు చాల దూరంగా ఎప్పుడూ నిరాడంబరంగా కనిపించే మహేష్ సామాన్యంగా యాగాలు హోమాలు సిద్ధాంతులకు సంబంధించిన వార్తలలో కనిపించడు. అయితే ఇప్పటి వరకు మహేష్ కు మూడక్షరాల టైటిల్ సెంటిమెంట్ మాత్రమే ఉంది అనుకున్నారు చాలామంది. ఈ సెంటిమెంట్ తో పాటుగా మహేష్ కు అంతర్లీనంగా మరొక బలమైన సెంటిమెంట్ ఉందా? అని అనిపించేడట్లుగా మహేష్ ప్రవర్తన ఉంటోంది అంటూ కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

మహేష్ బాబు సామాన్యంగా బయట రాడు


ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా వినడానికి మాత్రం ఈ వార్తలు చాల ఆ శక్తి దాయకంగా కనిపిస్తున్నాయి. ఇక వివరాలలోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు సామాన్యంగా బయట సినిమా ఫంక్షన్స్ కు కాని మరేదైనా పెద్ద ఫంక్షన్స్ కు వచ్చినప్పుడు లైట్ షేడ్ గ్రే కలర్ ప్లైన్ షర్ట్ లో కాని లేదంటే బ్లూ కలర్ ప్లైన్ షర్ట్ లో కాని కనిపిస్తూ ఉంటాడు. ఒకొక్కసారి లైట్ నేవీ బ్లూ ప్లైన్ షర్ట్ లో మహేష్ బయట ఫంక్షన్స్ కు వస్తూ ఉంటాడు.

ఎన్నో మల్టీ నేషనల్ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే మహేష్ కోరుకుంటే చాలామంది బాలీవుడ్ హీరోలులా తన బట్టలు డిజైన్ చేయడానికి ఒక ప్రముఖ డిజైనర్ సహాయ సహకారాలు తీసుకో కలిగిన స్థితి ఉంది మహేష్ కు. కానీ ఎక్కువగా బ్లూ కలర్  ప్లై షర్ట్ లలో మహేష్ కనిపించడం వెనుక ఒక సెంటిమెంట్ దాగి ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 


మంచు మనోజ్ పెళ్ళిలో చాల సింపుల్ గా వచ్చిన మహేష్


ఈ కామెంట్స్ ఈమధ్యనే జరిగిన మంచు మనోజ్ పెళ్ళిలో చాల సింపుల్ గా వచ్చిన మహేష్ లుక్ ను చూసి ఒక ప్రముఖ జ్యోతిష్కుడు కామెంట్ చేసినట్లు టాక్.మంచు మనోజ్ పెళ్ళిలో అతిధులుగా వచ్చిన టాప్ హీరోలు రకరకాల డ్రస్ కోడ్స్ లో వస్తే మహేష్ మాత్రం ఎప్పటి లాగే సింపుల్ గా కనిపించే బ్లూ కలర్ ప్లైన్ షర్ట్ తో రావడం వెనుక చాలామంది  చేతికి పెట్టుకునే ఉంగరాల రాళ్ల సెంటిమెంట్ లా కొన్ని కలర్స్ సెంటిమెంట్ ను  మహేష్ ఫాలో అవుతున్నాడు అనే వార్తలు కూడా ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా మంచు మనోజ్ పెళ్ళిలో మహేష్ కలర్ షర్ట్ సెంటిమెంట్ ఆ ఫంక్షన్ లో హాట్ టాపిక్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: