నందమూరి సింహం బాలకృష్ణ తన ‘లయన్’ సినిమా ఊహించిన విధంగా సక్సస్ అందుకోలేక పోవడంతో తన 99వ సినిమా విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈసినిమా గురించి ప్రస్తుతం ఒక లేటెస్ట్ విషయం బయటకు వచ్చింది. 

ఈ సినిమాలో బాలకృష్ణను చాల కొత్త లుక్ తో చూపెట్టడానికి ఈ సినిమా దర్శకుడు శ్రీవాస్ అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు టాక్. దీనికోసం బాలీవుడ్ నుంచి మేకప్ ఆర్టిస్టులను రప్పించినట్టు సమాచారం. గతంలో వాళ్లు అమితాబ్‌‌బచ్చన్‌, షారుఖ్‌‌ఖాన్‌‌లకు మేకప్‌ మేన్లగా పనిచేశారట. వీరి సలహాలతో బాలయ్య లుక్ ను మార్చి ఎలా స్క్రీన్ పై చూపెడితే బాగుంటుంది అన్న విషయాన్ని దర్శకుడు శ్రీవాస్ ఆ మేకప్ ఆర్టిస్టులతో తీవ్రంగా చర్చిస్తున్నట్లు టాక్. 

అయితే బాలకృష్ణ మాత్రం ముందు కథ ఫైనల్ కాకుండా అప్పుడే తన లుక్ గురించి ముంబాయి నుండి వచ్చిన మేకప్ ఆర్టిస్టులతో చర్చలు ఏమిటి అని తన అసహనాన్ని దర్శకుడు శ్రీవాస్ దగ్గర వ్యక్త పరిచినట్లు ఫిలింనగర్ టాక్. కోన వెంకట్ గోపీ మోహన్ లు ఏదోవిధంగా ఈ సినిమా కథకు హడావిడిగా మార్పులు చేసి ఈనెలాఖరుకు ఈ సినిమాను పట్టాలు ఎక్కిద్దామని ప్రయత్నాలు చేస్తున్నా బాలయ్య మాత్రం కథ పై పూర్తి క్లారిటీ రాకుండా ఈ సినిమాను ప్రారంభించ వద్దు అని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. 

ఎప్పుడూ లేని విధంగా బాలకృష్ణ తన 99వ సినిమా కథ విషయమై ఇంత పట్టు పట్టడం వెనుక ఒక కారణo ఉంది అని అంటున్నారు. ఈ సినిమా విజయాన్ని బట్టి బాలకృష్ణ 100వ సినిమాకు క్రేజ్ ఏర్పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్తుతులలోను తన 99వ సినిమా విషయమై రాజీ పడే ఉద్దేశ్యంలో బాలయ్య లేడు అని ఫిలింనగర్ సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: