‘ఈగ’ హీరో నానీకి రాజమౌళి మాటలు షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ సినిమాలో చిన్న పాత్రను అయినా ఇమ్మని కోరినా స్పందించని రాజమౌళి నాని అంచనాలకు భిన్నంగా ఇచ్చిన ట్విస్ట్ తో నాని షాక్ అయ్యాడు అన్న మాటలు వినపడుతున్నాయి.

ఇక వివరాలలోకి వెళితే ఈ విషయం అంతా ‘బాహుబలి’ ఆడియో వేడుకకు సంబంధించిన వ్యవహారం. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకoగా నిర్మించిన ‘బాహుబలి’ సినిమా ఆడియో ఈ నెల 31న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో అత్యంత ఘనంగా జరగబోతున్న ఈ ఆడియో వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను కూడా రాజమౌళి అప్పుడే మొదలు పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలు ఇలా ఉండగా ఈ వేడుకకు యంగ్ హీరో నాని యాంకరింగ్ చేయనున్నట్టు సమాచారం. నానీ పట్ల రాజమౌళికి ఉన్న ప్రత్యేక అభిమానంతో మన తెలుగు సినిమా జక్కన్న నానీ అడగకుండానే ఈ అవకాశం ఇచిన్నట్లు టాక్. ఇటీవల కాలంలో నానీ పలు సినిమా ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక హీరోతో ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ కు యాంకరింగ్ చేయిస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.

ఈ వార్తలే నిజం అయితే ‘బాహుబలి’ సినిమాలో నటించాలి  అన్న నాని కోరిక తీరిక పోయినా ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో వేదిక పై హడావిడి చేసే అదృష్టం నానీ కి దక్కింది అనుకోవాలి. ఈ అవకాశంతో నానీ టాప్ హీరో కాకున్నా టాప్ యాంకర్ గా రానున్న రోజులలో మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనా నానీకి ఇది ఊహించని షాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: