ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ వార్తలు వస్తే చాలు పవన్ విపరీతంగా పెoచిన గుబురు జుత్తు గుబురు గెడ్డం హాట్ టాపిక్ అవ్వడమే కాకుండా మీడియా కెమెరాలకు కూడ పవన్ లుక్ సంచలనంగా మారుతోంది. ఈమధ్యనే మంచువారి పెళ్ళి సందడిలో సందడి చేసిన పవన్ అవతరాన్ని ఆ ఫంక్షన్ లోని ప్రతి వ్యక్తి రెప్ప వేయకుండా చూసారు అంటే పవన్ గెడ్డం ఎంత మాయ చేస్తోందో అర్ధం అవుతోంది. 


ఒక స్వామీజీ పవన్ కు ఈ దీక్షను ఉపదేసించాడని టాక్


ఇప్పటికే ఎన్నో రూమర్లు వచ్చిన పవన్ ఈ కొత్త అవతారం పై మరో కొత్త రూమర్ హడావిడి చేస్తోంది. పవన్ ఇలా కనిపించడానికి గల కారణం పవన్ ఆచరిస్తున్న ఒక దీక్ష అనే రూమర్ మొదలైంది. పశ్చమ గోదావరి జిల్లాకు చెందిన ఒక స్వామీజీ పవన్ కు ఈ దీక్షను ఉపదేసించాడని టాక్. 

ఈ స్వామీజీ మాటలు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు విపరీతమైన నమ్మకం


మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ స్వామీజీ మాటలు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు విపరీతమైన నమ్మకం అనే మాటలు కూడ ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విడుదలకు ముందు ఈ స్వామీజీ హోమాలు చేసాడు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఈ హోమాల ఫలితం వల్లే విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చినా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిట్ట చివరకు విజయం సాధించింది అనే నమ్మకం త్రివిక్రమ్ కు ఉంది అని అంటారు. 

ఈ నమ్మకంతోనే త్రివిక్రమ్ సలహాతో పవన్ ప్రస్తుతం ఈ స్వామీజీ  దీక్షలో ఉన్నాడనే వార్తలు కూడ ఉన్నాయి. అయితే ఈదీక్ష పవన్ నటించబోయే సినిమాల గురించా? లేదంటే పవన్ రాజకీయ భవిష్యత్ గురించా? అన్న విషయం పవన్ కళ్యాణ్ కే తెలియాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: