తమిళంలో అద్భుతమైన నటనతో స్టార్‌గా గా మారిన తారల్లో ఒకరు జ్యోతిక. తమిళంలోనే కాక, ఇటు తెలుగులోనూ ‘చంద్రముఖి’తో పాటు ‘ఠాగూర్‌’, ‘మాస్‌’, ‘షాక్‌’ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత తమిళ స్టార్‌ సూర్యను వివాహం చేసుకున్నాక కొన్నాళ్ల పాటు నటనకు దూరమయ్యారు.

ఏడేళ్ల విరామం తర్వాత ‘36 వయధినిలె’ అనే సినిమాతో జ్యోతిక సెకండ్‌ ఇన్నింగ్‌ ప్రారంభించారు. మళయాళంలో హిట్టయిన ‘హౌ ఓల్డ్‌ ఆర్‌ యూ’ అనే సినిమాకు తమిళ రీమేకే ఈ ‘36 వయధినిలె’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. అయితే తాజాగా రిలీజ్ అయిన  ఈ మూవీ దమ్మురేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. 

దాదాపు చాలా కాలం విరామం తరువాత జ్యోతిక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడంతో, ఈ మూవీపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. తమిళనాట ఏకంగా 9కోట్లు సంపాదించినట్టు సమాచారం. చిన్న బడ్జెట్ మూవీగా వచ్చిన ఈ మూవీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అనేది ఇండస్ట్రీ వర్గాలను ఆశ్ఛర్యంలో ముంచెత్తుతుంది.

రోషన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సూర్య సొంత బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమాను తెలుగులోకి అనువదించే సూచనలు వున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: