రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బాహుబలి’ ఈ సినిమాలో ప్రబాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రభాస్ వేరే ఏ సినిమాతో కమిట్ మెంట్ పెట్టుకోలేదు. ఈ సినిమా రెండు సంవత్సరాల పాటు రూపొందించారు. ఇప్పుడు బాహుబలి విడుదలకు సిద్దం అయ్యింది, ఈ నెలలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వర్క్స్  నడుస్తున్నాయి, నెలాఖరున ఆడియో విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు.  


ఆలియా భట్ హాట్ అందాలు


ప్రభాస్ తర్వా చిత్రం రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్ దర్శకత్వం లో  తీయబోతున్నాడు. చాలా స్టయిలిష్ గా ఈ సినిమాలో ప్రభాస్ కనబడబోతున్నాడట, ఈ చిత్రానికి హీరోయిన్ కోసం గత కొంత కాలంగా అన్వేషించినా మొత్తాని దొరికేసింది. మరి ఆ భామ ఎవరా అనుకుంటున్నారా బాలీవుడ్ తన అందాలతో, చిలిపి తనంతో హాట్ హాట్ గా కనబడే చిన్నది  ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. మిర్చి, జిల్ చిత్రాలను నిర్మించిన యువి క్రియేషన్ ఈ సినిమాను నిర్మిస్తుంది.మరి టాలీవుడ్ లో అలియా ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటుందో చూడాలి . వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: