తను నటిస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నప్పటికీ, తనకి మాత్రం డిమాండ్ తగ్గటం లేదు. తనే బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సోనాక్షి సిన్హా. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, గతేడాది సోనాక్షి సిన్హా నటించిన యాక్షన్ జాక్సన్,లింగా చిత్రాలు అట్టర్ ఫ్లాప్ లుగా మిగిలిపోగా, ఈ ఏదాడి తేవర్ సినిమా కూడా అమ్మడికి నిరాశనే మిగిల్చింది. దీంతో ప్రస్తుతం బాగా డీలా పడింది అమ్మడు.

అయితే.. ఈ పరిస్థితుల్లో ప్రయోగానికి సిద్ధమైన సోనాక్షీ సింగిల్ గా బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. అమ్మడి గట్స్ కు మురిసిపోయిన ఓ డైనమిక్ డైరెక్టర్ సైతం... ఆమెకు లేడీ రజనీ ఆఫ్ ముంబై అన్న బిరుదు ఇచ్చేశాడట.  ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో అకీరా అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది సోనాక్షి. ఫాక్స్ స్టార్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ చిత్రం... 2011లో తమిళ నాట విజయం సాధించిన మౌనగురుకు సీక్వెల్.

ఇందులో సోనాక్షీ తండ్రి సీనియర్ షాట్ గన్ శత్రుఘ్న సిన్హా కూడా ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. అయితే ఇప్పటికే హాలీడే చిత్రంలో షోనాక్షీని డైరెక్ట్ చేసిన మురుగదాస్... అకీరాలో అమ్మడి నటనకు ఫిదా అయిపోయాడట. సోనా ఎనర్జీ లెవెల్స్ కు ముచ్చటపడి ఆమెకు లేడీ రజనీ ఆఫ్ ముంబై అని నామకరణం చేశాడట ఈ డైనమిక్ డైరెక్టర్.



మరింత సమాచారం తెలుసుకోండి: